18, డిసెంబర్ 2010, శనివారం

అప్సర



శిలను చెక్కుచున్న శిల్పితో నొక్కండు
"చేయుచుంటి వేమి?" చెప్పుమనిన -
"అప్సర శిలనుండి ఆగమించ వెలికి
సలుపుచుంటి నేను సాయ" మనియె!

9 కామెంట్‌లు:

  1. ఆచార్య ఫణీంద్ర గారూ !
    శిల్పి సమాధానం బావుందండీ !

    రిప్లయితొలగించండి
  2. మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

    SRRao
    శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  3. నంస్కారములు. " మీ అప్సరే బాగుందో ? అప్స్రరను మించిన పద్య మె బాగుందో ఫ్ఛ్ ! చెప్పడం కష్టం

    రిప్లయితొలగించండి
  4. ఎస్.ఆర్.రావు గారికి
    హృదయ పూర్వక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి నేదునూరి గారు!
    ’ఎన్నెల’ గారు!
    మీ అభిప్రాయాలను చాలా ఆలస్యంగా చూసినా, మండు వేసవిలో మంచు కురిసినంత సంతోషాన్ని కలిగించాయి.
    మీ ఇరువురికీ నా ప్రత్యేక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  6. మంచి భావాలు, భావాలకి తగిన భాష అందరికీ రాదు. మీరు మంచి కవి.

    రిప్లయితొలగించండి