8, మార్చి 2011, మంగళవారం

ఎవడో యొక్కడు ...



భువిపై వస్తువులేవియైన విడువన్, భూమార్గమందే చనున్!
అవనిన్, కేవల మగ్నికీల యెగబ్రా కాకాశ మార్గంబునన్!
భువనంబం దటు రాలిపోదురు గదా భూమిన్ జనుల్ పాపులై -
ఎవడో యొక్క డుదాత్తుడై ధ్రువుని తీ రెక్కున్ నభో వేదిపై!

2 కామెంట్‌లు:

  1. చాలాబాగుంది. ఇలాంటి గొప్ప పద్యాల మీద ఒక్క వ్యాఖ్య కూడా కనిపించకపోవడం బాధగా ఉంది. భాష పట్ల గౌరవం తగ్గిపోవడం, అసలు భాషే తెలియకపోవడం ఇందుకు కారణాలు. మీరు మనుషులు గుర్తించని మాణిక్యంలా కనిపిస్తున్నారు.

    రిప్లయితొలగించండి