తెలంగాణ ఉద్యమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలంగాణ ఉద్యమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2011, శుక్రవారం

గురూత్తముడు


ప్రాంత వివక్ష జూపు పరిపాలకులం గని గుండె మండి, స్వ
ప్రాంతమునందు దీన జన బాధల గాథ లెరింగి కుంది, తత్
ప్రాంత పునర్విముక్త నవ రాష్ట్రముకై "జయ శంకరుం" డవి
శ్రాంత మహోద్యమోజ్జ్వల ప్రశాసకుడయ్యె - గురూత్తమా ! నమః !

(వివాహము, కౌటుంబిక బంధాలను త్యజించి, యావజ్జీవిత పర్యంతం తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరుగని యోధునిలా పోరాడిన ఆచార్య జయశంకర్ గారి మృతికి నివాళిగా ...
- డా. ఆచార్య ఫణీంద్ర)