padyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
padyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2012, మంగళవారం

ఆలుమగలు




పూలును, పరిమళముల వలె -
పాలును, మీగడల వోలె - భాస్వంత శర
త్కాల శశియు, వెన్నెల వలె -
ఆలుమగలు కలసిమెలసి యలరారవలెన్!

24, డిసెంబర్ 2011, శనివారం

రామ భక్తి in every walk of life



వింతగ, రోజు ... ‘ఆఫిసు‘కు వెళ్ళెడి వేళ -  కలమ్ము కాన రా;
దెంతొ గవేషణన్ సలుప నెచ్చటొ యేదొ కలమ్ము జిక్కు - “అ
ద్దింతకు వ్రాయునా?“ యనుచు నేర్పడు శంకయె దీర, ‘రామ‘ యం
చంత లిఖించి చూతు - అటు లబ్బు నదెంతటి పుణ్యమో గదా!

10, జులై 2011, ఆదివారం

మెల్ల కన్ను


భార్య ప్రక్కనున్న పడతి అందాలను
రసికుడొకడు చూచి రక్తి నొందె -
భర్త చూపు భార్యపై ననుకొనిరెల్ల -
మెల్ల కన్ను వలన మేలు కలిగె!