భావుకత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భావుకత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఫిబ్రవరి 2012, సోమవారం

'పాంచజన్యం'



పాలిడెడి నెపమున వచ్చి ‘పూతన‘ తనన్
చంప గోరి, నోట స్థనము గ్రుక్క -
భావి నొత్త బోవు పాంచజన్యంబుగా
తలచు బాలకృష్ణు గొలతు మదిని!

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

అప్రయత్న సూర్య నమస్కారం


భూమి పయి నిలుచు భాగ్యమ
దేమో - తద్విధి ప్రదక్షణించుచునుం దీ
వ్యోమాలయ సూర్య పరం
ధామునకు, మదీయ జన్మ ధన్యత గాంచన్!

7, మే 2010, శుక్రవారం

ఆర్ద్రత



ఎడ నెడ పృథ్వియందు రమణీయ కవిత్వము, సత్కళాకృతుల్,
బుడుతల చేష్టలున్, కరుణ పొంగెడు దృశ్యములున్, చమత్కృతుల్
తడి గల నాదు గుండియకు దర్శనమై, కెలుకంగ తీయగా -
వడి వడి జాలువారు కనుపాపల కొల్కుల నుండి బాష్పముల్ !