7, మే 2010, శుక్రవారం

ఆర్ద్రతఎడ నెడ పృథ్వియందు రమణీయ కవిత్వము, సత్కళాకృతుల్,
బుడుతల చేష్టలున్, కరుణ పొంగెడు దృశ్యములున్, చమత్కృతుల్
తడి గల నాదు గుండియకు దర్శనమై, కెలుకంగ తీయగా -
వడి వడి జాలువారు కనుపాపల కొల్కుల నుండి బాష్పముల్ !