29, నవంబర్ 2010, సోమవారం

రక్తాక్షరాలు


విప్లవ కవి నణచివేయ, నాతని చేయి
నరికి, వికట రీతి నవ్వె రాజు!
క్రొత్త కవిత నపుడు గోడ నింకొక చేత
కారు రక్తమె గొని, కవి లిఖించె!

23, నవంబర్ 2010, మంగళవారం

చావు పుట్టుకలుఒద్దికగా యోచించితి -
గుద్దులు గుద్దితిని నుదుట - గోకితి తలపై -
బద్దలు గొట్టితి బుర్రను -
మొద్దు, నెరుగనైతి - చావు, పుట్టుక లేలో?

12, నవంబర్ 2010, శుక్రవారం

ఇల్లుజీవితాంతమ్ము కష్టించి చెమటనోడ్చి
ధనమునెంతొ సంపాదించి దాని తోడ
ఇల్లు నిర్మించునొకడు - ఇంకెవడొ యొకడు
అందు నివసించి సౌఖ్యాల ననుభవించు!

6, నవంబర్ 2010, శనివారం

ఖండనమ్మునేను చెప్పు మాట నీకు నచ్చనియెడ
ఖండన మొనరించు కచ్చితముగ !
కాని, నాదు మాట కన్న మించిన మాట
చెప్పి ఖండనమ్ము చేయుమయ్య !