24, జూన్ 2011, శుక్రవారం

గురూత్తముడు


ప్రాంత వివక్ష జూపు పరిపాలకులం గని గుండె మండి, స్వ
ప్రాంతమునందు దీన జన బాధల గాథ లెరింగి కుంది, తత్
ప్రాంత పునర్విముక్త నవ రాష్ట్రముకై "జయ శంకరుం" డవి
శ్రాంత మహోద్యమోజ్జ్వల ప్రశాసకుడయ్యె - గురూత్తమా ! నమః !

(వివాహము, కౌటుంబిక బంధాలను త్యజించి, యావజ్జీవిత పర్యంతం తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరుగని యోధునిలా పోరాడిన ఆచార్య జయశంకర్ గారి మృతికి నివాళిగా ...
- డా. ఆచార్య ఫణీంద్ర)

1 వ్యాఖ్య:

  1. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.in - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్‌లో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్‌లోని పాత ఆర్కివ్‌లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
    ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా

    ప్రత్యుత్తరంతొలగించు