20, ఆగస్టు 2013, మంగళవారం

ఒంటి చేతి చప్పట్లు!













అలిగిన తమ్ముల అలుక కారణ మేమి?”
     యనుచు నెరిగి తీర్చరయ్యె నాడు!
జరిగిన తప్పుల చక్కదిద్దెద మంచు
      నాశ్వాస మందించరయ్యె నాడు!
ఉవ్వెత్తు నెగసిన ఉద్యమమ్మును జూచి
       ఊరక నిర్లక్ష్యమూని నాడు -
అవహేళనలు సల్పి, అవమానములు జేసి,
        అణచివేతుమని అహంకరించి,

ఇప్పు డొక ప్రాంతమున  "సమైక్యమే!" యటంచు
ఒంటి చేయితో చప్పట్ల నూపు టన్న -
చేతులే కాలి, ఆకుల చేత బూను
మూర్ఖులటు గాదె సీమాంధ్ర ముఖ్యు లింక?
  

8 కామెంట్‌లు:

  1. ఒక ప్రాంతపు "మూర్ఖుని"
    అడ్డగోలు వాదనలె
    నిజమని నమ్మి
    ప్రాణత్యాగమొనర్చె జనులెల్ల
    ఐక్యమతమ్మె హితమని
    పెద్దలు సెప్పిన మాట
    అయ్యె నీటి రాత
    ప్రగతి పధాన గాక
    రాష్ట్రమయ్యె అధోగతి పాలు..

    (ఏమి సారు నా కవిత ప్రచురించడానికి మనసు రావట్లెదా?)

    రిప్లయితొలగించండి
  2. వోలేటి గారు!
    "నా కవిత ప్రచురించడానికి మనసు రావట్లెదా?" అని బ్రతిమాలుకొన్నారు కాబట్టి ప్రచురించాను.
    "ఐక్యమతమ్మె హిత"మని నీతులు కడుపు నిండిన వాడు కడుపు ఎండిన వాని కడుపు కొట్టడానికి వల్లిస్తాడు.
    అన్నదమ్ములైన కౌరవులు, పాండవులకు శ్రీకృష్ణుడు ఆ నీతే చెప్పక హస్తినాపుర విభజనకు ఎందుకు రాయబారం నడిపాడో చెప్పగలరా? అదంతా అర్థం కవాలంటే మీరింకా చాల ఎదగాలి!
    మీలాంటి వాళ్ళంతా ఒక్కని వల్లే ఇంతా జరిగింది అనుకొంటూ... ఆ ఒక్కణ్ణి ‘ఒకే ఒక్కడు‘గా హీరోను చేసారు. అది మీ అమాయికత్వమో ... మూర్ఖత్వమో ... మీకే తెలియాలి.
    మీరన్నట్టు "ఒక ప్రాంతపు మూర్ఖుని అడ్డగోలు వాదనలె" అయితే ... దేశమంతా ఆ వాదనకే ఎందుకు జై కొట్టింది? అంతెందుకు ... పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, హనుమాన్ చౌదరి గారు, ఓల్గా గారు, దేవీప్రియ గారు, శ్యాం బెనగల్ ఇంకా ఎందరో సీమాంధ్ర మేధావులే తెలంగాణవాదం న్యాయబద్ధమైంది అని ఎందుకంటున్నారు. మీరు వాళ్ళ కన్న మేధావులా?
    "ఐక్యమతమ్మె హిత"మని నమ్మే వాళ్ళయితే 1974లో ఎందుకు మీరు "జై ఆంధ్రా" అన్నారు? మీ అవకాశవాదానికి మీకే సిగ్గనిపించడం లేదా?

    రిప్లయితొలగించండి
  3. , 1956...1969.... 1974... ఇలాంటి చరిత్రలు అందరికీ తెలుసు.. ఇది 2013 .. ఇప్పటి వర్తమాన పరిస్థితి రేపు విభజన జరిగితే ఏర్పడే స్థితి, ఇరు ప్రాంతాలు నష్టపోయే పరిస్థితి అంచనా వేయగల్గే ఎత్తుకి ఎదగాలి మీరు...

    రిప్లయితొలగించండి
  4. అదే .. అదే ...
    ఎప్పటి కెయ్యది లాభమొ ....
    అప్పటి కా పిల్లిమొగ్గ ..... అదె మీ స్వార్థ పూరితమైన ఎదుగుదల!

    రిప్లయితొలగించండి
  5. ఎవరిది స్వార్ధపూరిత ఎదుగుదల.. తెలంగాణా వాళ్ళు అంతా ఆకులు కప్పుకుని తిరుగున్నారా... చదువుకుని విదేశాలకి వెళ్ళడం లేదా.. తెలంగాణా వాళ్ళంతా అమాయకులూ ఆంధ్రా వాళ్ళు అంతా స్వార్ధపూరితమైనవాళ్ళుగా చిత్రీకరిస్తూ వెయ్యి ఏళ్ళయినా కవితలు రాస్తారు.. డబ్బంతా హైదరాబాద్ మీద పోసి సీమాంధ్ర ఎడారిగా మార్చిన మీవి నిస్వార్ధ వాదమా.. ఏవైనా అంటే నాయకుల్ని అడగండి అంటారు.. అదే జరుగుతోంది ఇప్పుడు.. ఈలోగా మీ లాంటి వాళ్ళు నోరు పారేసుకోవడం వలన మీ కొచ్చే తెలంగాణా రాకుండా పోతోంది..

    రిప్లయితొలగించండి
  6. తెలంగాణ వాళ్ళు చదువుకుని విదేశాలకి వెళ్ళినా .. న్యూ జెర్సినొ, వాషింగ్టన్నొ మాది అనరు. అక్కడి స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పడితే అడ్డుపడరు. అంతెందుకు? అక్కడికి వెళ్ళిన మిగితా భారతీయుల లాగే సీమాంధ్రులు కూడ ఆ పని చేయలేరు. చేస్తే వాళ్ళు తన్ని తగిలేస్తారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అమాయికులు, మంచివాళ్ళు కాబట్టే మీలాంటి వాళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.హైదరాబాదు మీద మీరు పోశారంటున్న డబ్బు, ఆస్తులు, భూములు.. అన్నీ కావూరి, లగడపాటి వంటి సీమాంధ్ర వ్యాపార రాజకీయుల చేతుల్లోనే ఉన్నాయి. వాటి వల్ల తెలంగాణ పేదలకు ఒరిగిందేమీ లేదు. రేప్పొద్దున వాళ్ళు ఆ ఆస్తులను ఏర్పడబోయే తెలంగాణ ప్రభుత్వానికేమి రాసివ్వరు కూడ. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందాన్ని కాలరాయడం దగ్గర నుండి .. ఇప్పుడు తెలంగాణ , సీమాంధ్రల ప్రాంతాలేవి ఆశించినంత అభివృద్ధి చెందకపోవడానికి కారణం మీ సీమాంధ్రుల స్వార్థ రాజకీయాలే.
    ఇప్పుడు ఆ స్వార్థ రాజకీయాల నుండి రెండు ప్రాంతాలను రక్షించడం కోసమే రాష్ట్ర విభజన అన్నది మీలాంటి వితండ వాదుల బుర్రల కెక్కక పోవడం దురదృష్టం. బుర్రకెక్కినా మీరు మాయ మాటలే వల్లిస్తారు.
    ఎందుకంటే మీకు కావలసింది సీమాంధ్ర పేదల ప్రయోజనాలు కావు. ఆ స్వార్థ లాభాలలో కొంత ఫలాలు మీలాంటి మధ్య తరగతి ఉన్నత వర్గాలకూ అందుతున్నాయన్న మీ స్వార్థమే.
    మీ ఎకసెక్కపు కవిత, వాదనలో పాయింట్ ప్రకారం వాదించ లేక .. "ఆకులు కప్పుకుని తిరుగున్నారా..." వంటి నోరు పారేసుకోవడాలు .. శాంతంగా ఆలోచించి చూస్తే - అది మీలాంటి వాళ్ళ సహజ లక్షణమని మీకే తెలుస్తుంది. అహంకారంతో _ "మీ కొచ్చే తెలంగాణా రాకుండా పోతోంది.." అని మీరు అన్నా... భూమి మీద ఏ శక్తి ఇప్పుడు తెలంగాణను ఆపలేన్నది అక్షర సత్యం! ఎందుకంటే ఎప్పుడూ అంతిమ విజయం ధర్మానిదే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగువాడు న్యూజెర్సీలో బతికడానికీ, హై.లో బతికడానికీ తేడా ఏమీ లేనట్టు మాట్టాడ్డం అతితెలివైనా కావాలి, తెలివితక్కువతనమైనా కావాలి.

      ఏం.. బెంగళూరులోనో, ఢిల్లీలోనే ఉండే తెలుగువాళ్ళు అవి మావే నంటున్నారా? హై. ఇన్నాళ్ళుగా మన రాజధాని కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. మనది అనుకుంటున్నాం. కాదు అని ఎవడైనా అంటే స్పందన ఇట్టాగే ఉంటది. ఏం.. హై. లేని తెలంగాణ ఏర్పాటు చేస్తామని అంటే తెలంగాణలో ఇలాంటి గొడవలు వచ్చేవి కాదా? మే చేస్తే ఏదైనా రైటే, మీరు చేస్తే ఏదైనా తప్పే అనే చచ్చు వాదనలు ఇక మాకు చెప్పకండి. వినీ వినీ బోరు కొట్టేసింది. ఆకుకూ పోకకూ అందని ఈ హై.-న్యూజెర్సీ పోలికలు ఆపండి. ఇక విన్లేం.

      తొలగించండి
  7. ఏం తెలివితేటలండి! ఒకాయన .." తెలంగాణా వాళ్ళు అంతా ఆకులు కప్పుకుని తిరుగున్నారా... చదువుకుని విదేశాలకి వెళ్ళడం లేదా.." అంటారు. దానికి సమాధానం చెప్పితే ... ఇంకో ఆయన వచ్చి చర్చను ఇంకో వైపు లాగుతారు.
    నేను చెప్పింది పద్ధతి గురించి. ఈ ‘చదువరి‘ దీనిని హైదరాబాదును న్యూజెర్సితో పోలుస్తున్నాననుకొంటారు. చర్చలను పక్కదోవ పట్టిస్తూ పదమూడేళ్ళు గడిపి ఏం సాధించారు. చివరికి ఓటమి వెక్కిరిస్తుంటే - ఉఛ్ఛం .. నీచం వదిలేసి నోరు పారేసుకొంటున్నారు.
    " ఆకుకూ పోకకూ అందని ఈ హై.- " అట ... ఇదీ వీళ్ళ మాతృ దేశాభిమానం! అందని ద్రాక్ష పుల్లన మరి!
    ఒకప్పుడు ఒక బ్లాగు చర్చలో నేనన్న మాట గుర్తుకు వస్తున్నది. "మేము హైదరాబాదును కన్నతల్లిగా భావిస్తాం.. మీరు భోగాలు తీర్చే వెలయాలిగా చూస్తారు" అని. అది నిజమని నిరూపించారు ఈ "చదువరి".
    ఆంధ్ర రాష్ట్రంలో కాక తెలంగాణలో ఉన్నంత మాత్రాన హైదరాబాదు భారత భూమి కాకుండా పోతుందా? మాతృభూమి గురించి "ఆకు.. పోక.. " అని మాటాడడానికి సిగ్గుండాలి.

    రిప్లయితొలగించండి