5, జనవరి 2014, ఆదివారం

పద్య సుధ


నిండియు నిండకుండనె కనీసము బాల్యము గూడ నాకు, మున్
గుండెకు చిల్లు బడ్డదని ఘొల్లున యేడ్చిన నాదు తల్లితో -
"ఉండవె అమ్మ! అంతగ మనోవ్యథ యేలనె? చిల్లు బడ్డచో,
దండిగ లోని పద్య సుధ ధారగ కారు" నటంచు పల్కితిన్!

2 కామెంట్‌లు:

  1. మీ యెద తేనె పట్టు కుపమించెడు - తియ్యని తెల్గు తేనియల్
    పాయక బొట్టు బొట్టులుగ పద్య సుధారస ధార కారుచున్
    హాయి యొసంగు చున్నది - మహాత్మ! ఫణీంద్ర ! - తెలుంగు శారదా
    మాయికి మౌక్తికాభరణ మాలికలై యజరామరంబుగన్ .
    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  2. రాజారావు గారు!
    ధన్యోస్మి! మీకు అనేక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి