క్రూరాత్ముం డక్కట! వదినెకే ద్రోహమే జేయ బూనెన్ -
ఘోరంబౌ రీతిటుల మదిలో కుంద, నా వస్త్ర మీడ్చెన్ -
రారా కృష్ణా! పడతి కిడి సంరక్ష, మానంబు గావన్!
ఈరా వస్త్రంబు! చెలియలు న న్నీవె వేగంబె ప్రోవన్! #
డా.ఆచార్య ఫణీంద్ర ముక్తక పద్యాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి