27, అక్టోబర్ 2010, బుధవారం

శునక సూక్తి ముక్తావళి" విశ్వాస హీనులై విర్రవీగ, మనము
మానవులము కాము - మరచి పోకు!
సాటి వారనిన ఈర్ష్యా ద్వేషముల్ గల్గ,
మానవులము కాము - మరచి పోకు!
ఐకమత్య మొకింత లేక కాట్లాడగా,
మానవులము కాము - మరచి పోకు!
యజమాని యెడ విధేయత వీడి వర్తింప,
మానవులము కాము - మరచి పోకు!

శునకమన - కాస్త ’శునకత్వము’ ను గలుగుచు,
సాటి శునకాల గౌరవించవలె - " నంచు
పిల్ల కుక్కకు బోధించె పెద్ద కుక్క
శునక పరిభాషలో నీతి సూక్తులెన్నొ!

2 వ్యాఖ్యలు: