8, డిసెంబర్ 2012, శనివారం

నిస్వార్థ జీవనం



పూవులు పూచి, దేవతల పూజలకై వినియోగ మొందురా!
పూవులు నల్గి, దంపతులు పొందు సుఖంబు మరింత పెంచురా!
పూవులునై యలంకరణముల్ కనువిందును సేయు; పంచు నె
త్తావుల గాని - స్వార్థమున తా మెది పొందవు జీవితంబునన్!

4 కామెంట్‌లు:

  1. నిస్వార్ధంగా అలరించే పుష్పాలెన్నో ఈ జగతిలో....

    రిప్లయితొలగించండి
  2. భూవలయంబులో మనుజ భూమిక నీది , మనోజ్ఞ సృష్ఠిలో
    పూవులు నీవలే సహజ భూమిక దాల్చు మనోహరాకృతుల్ ,
    తీవల నుండి పూవులను తెంపు వినోదపు హింస జేతువా ?
    నీవొక తోటమాలి వయి నేమము దాల్తువ ? మాన్య మానవా !
    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  3. రాజారావు గారు !
    సృష్ఠి కాదు - సృష్టి.
    అలాగే ... నీ వలే కాదు - నీ వలెన్.
    పద్యం బాగుంది.
    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి