22, డిసెంబర్ 2012, శనివారం

వాడను నేదియో ...

వాడు తలంప తిమ్మియగు బమ్మియె - బమ్మియు నౌర తిమ్మియున్!
వేడుక లంతరించి మది వేదన నిండు క్షణమ్ము లోపలన్ -
గోడులు, కష్టముల్ తొలగి కూడును మోదము నంత నంతలో!
వాడను నేదియో - అదియె  వర్తిలు నీ జగమందు సర్వదా! 

2 కామెంట్‌లు:

  1. వాడికి తెల్వదా ? బడుగు వాళ్ళొక పూటకు కూడ కూటికై
    ఓడుట , వేడుకా యిది ? మహోన్నత దివ్య కృపావలంబమా ?
    నేడొక కొంత మంది ధరణీ తల మందలి సంపదంత నే
    కాడికి దోచుకోగ నిటు కావలి కాయుట వాడి తత్త్వమా ?
    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  2. అమ్మో! నేనొక పద్యం వ్రాస్తే - దాని విరుగుడుగా మరో పద్యం వ్రాసి, నన్ను నాస్తికునిగా మార్చేద్దామనే ... !

    హ్హ..హ్హా... రాజారావు గారు!

    ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని రావడం వలన మీ వ్యాఖ్యను ఆలస్యంగా చూసాను.

    నా పద్యంలో - స్తుతి, నింద ... రెండూ ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించండి.
    మరొక విషయం ... "వాడను నేదియో - అదియె వర్తిలు" అంటే "వాడికి తెలియదు" అని కాదు అర్థం! "వాడేదంటే అదే అవుతుంది" అని! అట్లాగే ... "వేడుక లంతరించి" అంటే "ఆయనకు వేడుక" అని కాదు. "మన వేడుక లంతరించి పోతా"యని. సరిగ్గా అవగతం చేసుకోండి. చివరికి ... నా పద్యంలోని నిందార్థం .. మీ పద్యంలోని డైరెక్ట్ అర్థం దాదాపుగా ఒకటే! కాకపోతే నా పద్యం డైరెక్ట్ గా చూస్తే స్తుతిలాగే కనిపిస్తుంది. అది నా గొప్పతనం కాదు. వ్యంగ్య వైభవం అది!
    ఇంకొక చిన్న విషయం ... "తెల్వదు" - సాదు రూపం కాదు ... "తెలియదు" అనాలి.

    మీ పద్యం బాగుంది. అభినందనలు!

    రిప్లయితొలగించండి