1, సెప్టెంబర్ 2014, సోమవారం

అంద మికెట్టుల బట్ట గట్టురో!


పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

6 కామెంట్‌లు:

  1. Namaskaram... entha chakkaga vundi bapu gariki mee nivali..

    రిప్లయితొలగించండి
  2. బాపు(లే)రే అన్న వార్త కొంచెం బాధాకరమే గాని , తన చిహ్నాలను చిత్రాల ద్వారా మనందరికి వదలి వెళ్ళిపోయారు తన ఆప్తమిత్రుడిని కలుసుకొనటానికి .

    రిప్లయితొలగించండి
  3. శర్మ గారు!
    నిజమే ... అయినా మనకు బాధాకరమే కదా!
    మీకు నా ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి