15, జులై 2016, శుక్రవారం

నాదు వాహనము .. !


నే గమియింతు "నాఫిసు"కు నెమ్మదిగా తలపోయు చేదియో -
"వేగము పెంచు - 'ఝా'మ్మనుచు వేడుకగా పయనింత" మంచు తా
వాగును నాదు వాహనము! "వద్ద"ని నే కడు ప్రేమ దానికిన్
సైగను జేసినంత, నది చల్లబడుంజుమి బుంగ మూతితో!   

3 వ్యాఖ్యలు:

 1. వేగమనర్థదాయకము వేయుడు బ్రేకులు బండినెక్కుచో
  వేగము లేనిచో విజయ వీణియ మ్రోగదు కార్యసాధనన్
  వేగము లెల్ల చోట్ల తగ వేమిట వల్వదొ యేమిటొప్పునో
  బాగుగ చింత చేయగలవాడు జయుండగు నెల్ల వేళలన్

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రాజారావు గారు .. నా పద్యం కన్న మీ పద్యం బాగుంది. మీకు నా అభినందన పూర్వక ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మిత్రులు ఫణీంద్రగారు, మీ రన్నది నిజం. రాజారావుగారి పద్యం మరింత ధారాశుధ్ధిగా వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు