19, జనవరి 2017, గురువారం

దీపారాధన


విశ్వము నొక ప్రమిద యట్లు వెలయజేసి,
సకల సాగర జలములే చమురు గాగ -
ఆకసమె వత్తి యనగ, సూర్యాగ్ని తోడ
దీపము వెలిగించెద నీకు దేవదేవ!

2 వ్యాఖ్యలు:

 1. కొండ మీద వెల్గు గోరంత దీపమ్ము
  కొండ క్రింది గుడికి అండ నిలువ,
  గుడిని వెలిసి నట్టి కోనేటి నాధుండు
  ఆరి పోవు దివ్వె కండ యగున ?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అగుననే ఆస్తికుల విశ్వాసం!
  మీకు నా ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు