15, ఆగస్టు 2017, మంగళవారం

నీ లోటే గతిన్ తీరునో?

నాకే గాదు - సమస్తమౌ యువతకున్ నవ్యాంధ్ర సాహిత్య స
త్ప్రాకారాంతరమందు జేరి నవ రక్తావేశులై కైతకున్
శ్రీకారం బొనరింప, ప్రేమ నిడితో చేయూత! ఓ సాహితీ
లోకోద్ధారక! "పోతుకూచి" కవి! నీ లోటే గతిన్ తీరునో?

ఇటీవల పరమపదించిన సాహితీ మూర్తి, "విశ్వ సాహితి" అధ్యక్షులు డా. పోతుకూచి సాంబశివరావు గారి మృతికి సంతాపంగా ...
- డా. ఆచార్య ఫణీంద్ర  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి