21, సెప్టెంబర్ 2009, సోమవారం

పెండ్లి కూతురు




అరయ కవనమన్న ఆలోచనమె గదా !
ఊహ విస్తరించి దేహమగును -
మేలి పదములన్ని మెరుగు భూషలగును -
కూడి, కవిత పెండ్లి కూతురగును !

8 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది ఫణీంద్రగారూ.. చిన్న చిన్న పదాల మేలిమి పద్యం

    రిప్లయితొలగించండి
  2. భాస్కర రామి రెడ్డి గారూ...

    కొత్త బ్లాగులో మీ వంటి సహృదయులు తొలిసారిగా పాదం మోపి పావనం చేయడం - ఆనందంగా ఉంది.
    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  3. ఫణీంద్ర గారూ,
    రెండవ పాదాన్ని ఒకసారి చూడండి.

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్య గారు !
    పాదం విరుపు ఎక్కడో మీరు గమనించనట్టుంది. ’ భావ విస్తరణ ’ అన్నది ఒక ’ ప్రభా కాయమగును ’ అని చెప్పాను.
    ’ విస్తరణ ’, ’ ప్రభా ’ అన్నవి ఒకే సమాసంలో భాగాలు కావు కాబట్టి, ’ ణ ’ - ’ గురువు ’ కాదు. మీ సందేహం తీరిందనుకొంటాను. సరే ! మరెవరికీ ఈ సందేహం కలుగకుండా, ’ విస్తరణ ’ తరువాత ఒక ’ కామా ’ పెడుతున్నాను. చూడండి.

    రిప్లయితొలగించండి
  5. ఫణీంద్ర గారూ,
    మీరు చెప్పినట్లు ఆనుకున్నా నాల్గవ గణం తగణం అవుతున్నది. చూడండి.

    రిప్లయితొలగించండి
  6. శంకరయ్య గారు !
    నిజమేనండోయ్ ! నేను గమనించనే లేదు.
    ఘోరమైన తప్పిదమే ! క్షమించండి !
    తప్పు చూపినందుకు కృతజ్ఞతలు !
    పాదాన్ని సరిదిద్దాను !

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారు !
    రెండవ పాదాన్ని సరిదిద్దాను గానీ, సంతృప్తినీయ లేదు.
    అందుకే, ఇప్పుడు మొత్తం పాదాన్ని మార్చాను.

    రిప్లయితొలగించండి
  8. వాహ్... ఫణీంద్ర గారూ,
    నిజంగానే ఈ పద్యం ఇప్పుడు మెరుగు భూషణమయింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి