1, సెప్టెంబర్ 2011, గురువారం

నీకు మ్రొక్కెదన్!




భుజమున గల్గు బాల ఫణి భూషణ మొక్కటి నీదు తొండమున్
నిజ కుల జీవిగా తలచి నెయ్యము సేయగ మేళగించ, ఆ
బుజిబుజి రేకు నాగు గని ముచ్చటగా ముసి నవ్వు రువ్వెడిన్
గజ ముఖ! పార్వతీ తనయ! కావుమటంచిదె నీకు మ్రొక్కెదన్!


విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగు లీనుతున్న తెలుగు వారందరికీ
’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు !
- డా. ఆచార్య ఫణీంద్ర

2 కామెంట్‌లు:

  1. అద్భుతం. మన పూర్వ కవుల కవితావైభవం మీలో కనిపిస్తోంది. మళ్లీ మన పాత కావ్యాలన్నీ చదవాలనిపిస్తోంది. సంతోషం పట్టలేకపోతున్నాను.

    రిప్లయితొలగించండి
  2. కిశోర్ గారు!
    మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి