"నా తెలంగాణ రత్నాల వీణ" యటంచు
ఎలుగెత్తి కవులు గర్జించు నాడు ...
జన స్వామ్యమును గోరి, జాతీయ భావనల్
నేతలు ప్రజలందు నింపు నాడు ...
కూలి రైతులు పంట కోతల బదులుగా
’నైజాము’ సేనలన్ నరుకు నాడు ...
’బతుకమ్మ’ లాడేటి బాలికల్ తెగియించి
బందూకులను చేత బట్టు నాడు ...
భారతోపప్రధాని ’సర్దారు పటెలు’
ఈ భువికి విమోచనము కల్గించు నాడు ...
మా తెలంగాణ స్వాతంత్ర్య మహిత చరిత -
కనులలో దృశ్య మాలికై కదలు నేడు!
Chaala baundi...
రిప్లయితొలగించండిDhanyavadalu Krishna garu!
రిప్లయితొలగించండి