30, ఏప్రిల్ 2013, మంగళవారం

పద్య పుష్పములతో ...



నాజూకైన మదీయ భావ తతులన్ నాణ్యాంధ్ర శబ్దాళితో
తేజశ్శిల్ప మనోజ్ఞ ఛందముల నుద్దీపింప పద్యంబులై,
రాజీవాక్షుని ముద్దు గోడల! నినున్ ప్రార్థింప పుష్పంబులౌ!
పూజింతున్ నిను పద్య పుష్పములతో పూర్ణేందు బింబాననా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి