2, నవంబర్ 2013, శనివారం

జీవనయాత్ర ... !



జీవనయాత్రలో "బ్రతుకు జీవుడ!" యంచు నెదో భుజించి, నే
కావలె నిద్ది యద్ది యని కాంక్షలు లేక, యదెట్లు సాగునో -
యా విధి సాగిపోవుచు, మదాత్మకు తృప్తిని గూర్చు కోసమై
నా విధులన్ నిబద్ధముగ నా తల దాలిచి, యాచరించితిన్!

2 కామెంట్‌లు:

  1. సర్, విధికి తల వంచి నా జీవన విదానాన్ని యదావిధిగా నిర్వర్తిస్తాను అనటం ఎంత వివేకమో కదా...

    రిప్లయితొలగించండి
  2. ఫాతిమా గారు!
    అవును! జీవితంలో ఏమీ కోరుకోకుండా, నిస్వార్థంగా విధులను నిబద్ధతతో ఆచరించడం అన్నది పరిణతికి సంబంధించిన వివేకమే!
    మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి