ఎవరురా నాలోన ఇన్నిన్ని భావాల
వెలయించుచున్నది వెల్లువెత్తి -
ఎవరురా నా నోట ఇన్నిన్ని శబ్దాల
ఒలికించుచున్నది ఊట గట్టి -
ఎవరురా నా చేత ఇన్నిన్ని పద్యాల
పలికించుచున్నది వరుస బెట్టి -
ఎవరురా నాకింత ఇలలోన ప్రఖ్యాతి
కలిగించుచున్నది కరుణ గల్గి -
అద్ది నా యమ్మ ’శ్రీవాణి’ అమిత కృపయె!
ఇంక రచియింతు నిర్భీతి నెల్ల నిజమె!
"ఎవ్వరొ - నిరాదరింతురో ఏమొ - " యనుచు
లౌక్యముగ కైత లల్లెడి లౌల్య మేల?
ఎంత అధ్బుతమైన శైలి, మా వంటి వారు చదివి తెలుసుకోవల్సిన టపాలు ఇవి. బాగుంది అనటం మీ స్థాయిని తగ్గించటం అవుతుంది.
రిప్లయితొలగించండిఫాతిమా గారు!
రిప్లయితొలగించండిధన్యవాదాలు!