9, ఆగస్టు 2016, మంగళవారం

నీరము ...


నీరము పుట్టి విష్ణుపద నీరజయుగ్మమునందు గంగయై,
పారుచు దేవలోకముల పావనమై, శివశీర్షమెక్కి తా
జారి, ధరిత్రి సాగి పలు స్థానములందు జనోపయోగమై,
చేరె సముద్ర గర్భమున కృష్ణయు, గౌతమి, నర్మదాదులై!

3 కామెంట్‌లు:

  1. నీరజ నాధుడెంత కమనీయముగా గనుపట్టుచుండె, నిం
    పారగ నింగి వీడి పరువాల జలమ్ములు దాకి ముద్దిడన్
    చేరగ వచ్చినట్లు, నును సిగ్గుల మొగ్గయి కృష్ణవేణి సిం
    గారపు పుష్కరాభరణ కన్యకయై కనువిందు చేసెడిన్.

    రిప్లయితొలగించండి
  2. లక్కాకుల వారి పద్యకళా మాధుర్యానికి ప్రణతి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యకళా మాధుర్యపు
      విద్యలు తమబోటి వారి ప్రియ సహచర సం
      పాద్య లవ లేశ విథములు ,
      సాధ్యములగునా ఫణీంద్ర సారూ ! నాకున్ .

      తొలగించండి