6, నవంబర్ 2009, శుక్రవారం

చిత్రం !ఒక శిల గుడిలో ప్రతిమగు -
ఒక శిల ఆ గుడికి ముందు నొదుగును మెట్టై -
ఒకదానిని మ్రొక్కెదరు - మ
రొకదానిని త్రొక్కెద, రదియొక చిత్రమ్మే !

2 వ్యాఖ్యలు:

  1. ఉలి దెబ్బలకు తట్టుకున్న శిల భగవంతుని విగ్రహం, తట్టుకోలేని రాయి గుడి మెట్టు అవుతున్నదన్న నానుడిని ఓ చక్కటి పద్య రూపంలో గుర్తు చేసారు.

    ప్రత్యుత్తరంతొలగించు