11, జులై 2011, సోమవారం

’ఉట్టి’ కొట్టవోయ్!



త్రాడు పైకి, క్రిందికిని కేంద్రమ్ము లాగు -
నిలువరింప సీమాంధ్రులు నీళ్ళు జల్లు -
గట్టి దీక్షతో ఓ తెలంగాణ వీర!
ఎగిరి తెలగాణ ’ఉట్టి’ సాధించుమోయి!

4 కామెంట్‌లు:

  1. రకరకముల పూలు రమ్యమై యొకచోట
    రంగు లన్ని గూడి హంగు గాను
    యుండి నట్లు తోచె నుత్సాహమే గల్గె
    బ్లాగు జూడ నాకు, బాగు ! బాగు !

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారు!
    మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  3. కవితల్లోని మీ ప్రాంతీయ వాదం గురించి ఎందరో ఎన్నో విమర్శలు చేస్తున్నారు. నాకు అవి అనవసరం. ఓ కవిగా మీ పద్యాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. చాలాకాలం తరవాత చక్కటి ఛందస్సు చదివిన ఆనందం అందించారు. నిజానికి తెలుగుతల్లిని తిట్టడం తెలంగాణ ఉద్యమంలో నేను భరించలేని అంశం. తెలుగుభాష పట్ల మీకున్న అభిమానానికి, మీలోని కవితా సరస్వతికి నా పాదాభివందనం.

    రిప్లయితొలగించండి
  4. కిశోర్ గారు!
    మీరు చూపుతున్న ఆదరణకు నా నమోవాకాలు!

    రిప్లయితొలగించండి