13, జనవరి 2012, శుక్రవారం

సంక్రాంతి సంబరములు


రైతన్న యేడాది శ్రమశక్తి ఫలముగా
చనుదెంచు సౌవర్ణ్య సస్యలక్ష్మి -
పడతి చేతుల నుండి వాకిళ్ళ ప్రవహించు
రాటుదేలిన విద్య రంగవల్లి -
బుడబుక్కవా డూదు బూర గానమ్ముతో
ఘల్లుఘల్లున గెంతు గంగిరెద్దు -
”హరిలొ రంగో హరీ హరి” యంచు కీర్తించు
హరిదాసు మ్రోయించు చిరత రవము -

గగనమున బాలు డాడించు గాలిపటము -
పొంగలి, చకినా, లరిసెల పొడము రుచులు -
పల్లె పల్లెన్ ప్రతీకలై పరిఢవిల్లి
చాటును మకర సంక్రాంతి సంబరములు!


విశ్వవ్యాప్తంగా విస్తరిల్లి విరాజిల్లుతున్న తెలుగు వారందరికి
సంక్రాంతి పర్వదిన శుభాభినందనలతో -
డా. ఆచార్య ఫణీంద్ర

6 వ్యాఖ్యలు:

 1. మాలా కుమార్ గారు!
  ధన్యవాదాలు!
  మీకు కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా బాగుంది. హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. జయ గారు!
  ధన్యవాదాలు!
  మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక సంక్రాంతి పర్వదిన శుభాభినందనలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా చక్కగా చెప్పారు. కాస్త ఆలస్యంగా మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రసజ్ఞ గారు!
  మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు