ఈ ప్రశ్న ఒక శాస్త్రవేత్తనే అడగడం గమ్మత్తుగా ఉంది. ఏం - గణితజ్ఞునికి, శాస్త్రవేత్తకు హృదయం ఉండక్కర లేదా? స్పందనలు ఉండక్కర లేదా? తిక్కన మహామంత్రి, రాయలు మహారాజు, వేమన రస శాస్త్రవేత్త ... వాళ్ళలా కవిత్వం వ్రాయనక్కర లేదు. ఆస్వాదించడానికి కూడా ఆసక్తి అక్కర లేదా? అందుకే హృదయాలు బండ బారుతున్నాయి. వ్యక్తిత్వాలు దిగజారుతున్నాయి. మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యులు వ్రాసిన పద్యం గుర్తుకు వస్తున్నది -
సరస కవితయన్న, సంగీత కళయన్న వ్యంగ్యమన్న, లలిత హాస్యమన్న అవని విముఖులున్న అదియె వారికి శిక్ష! వేరు శిక్ష ఇంక వేయ నేల?
చం. పసులని భాగ్యహీనులని పాపమయో యని జాలిజూప నీ
రిప్లయితొలగించండివసుమతి నెల్ల వారికి నవశ్యము కావ్యవినోదగోష్ఠి మా
నసమున కింపు గూర్చ వలెనా గణితజ్ఞుడొ శాస్త్రవేత్తయో
రసికుడు గాక యుండిన తిరస్కరణీయుడె వ్యర్థజీవియే?
ఈ ప్రశ్న ఒక శాస్త్రవేత్తనే అడగడం గమ్మత్తుగా ఉంది.
రిప్లయితొలగించండిఏం - గణితజ్ఞునికి, శాస్త్రవేత్తకు హృదయం ఉండక్కర లేదా? స్పందనలు ఉండక్కర లేదా?
తిక్కన మహామంత్రి, రాయలు మహారాజు, వేమన రస శాస్త్రవేత్త ... వాళ్ళలా కవిత్వం వ్రాయనక్కర లేదు. ఆస్వాదించడానికి కూడా ఆసక్తి అక్కర లేదా?
అందుకే హృదయాలు బండ బారుతున్నాయి. వ్యక్తిత్వాలు దిగజారుతున్నాయి.
మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యులు వ్రాసిన పద్యం గుర్తుకు వస్తున్నది -
సరస కవితయన్న, సంగీత కళయన్న
వ్యంగ్యమన్న, లలిత హాస్యమన్న
అవని విముఖులున్న అదియె వారికి శిక్ష!
వేరు శిక్ష ఇంక వేయ నేల?