19, అక్టోబర్ 2012, శుక్రవారం

"కెమెరామెన్ గంగ"



’గంగ‘,’కెమెర మెన్’కు లింగ భేదము లేదొ?
ఏక వచన మేదొ, ఏది బహు వ
చనమొ - ఎరుగకుండ సినిమ పేరును బెట్టె!
‘మాసు దర్శకుని‘కి మతి చలించె!!

6 కామెంట్‌లు:

  1. అవును సర్
    గొడవలో పడి ఎవరూ గమనించలేదు.
    గంగ కెమరామెన్ ఎట్లా అవుతుంది
    కెమెరా వుమన్ కదా.
    వస్తువేకాదు వ్యాకరణమూ వంకరే నన్నమాట.

    రిప్లయితొలగించండి
  2. పద్యం బాగుందండి. గతితప్పిన ఫిల్మ్ ఇండస్ట్రీలో మతిచలించిన దర్శకులదే రాజ్యం.

    రిప్లయితొలగించండి
  3. విశ్వరూప్ గారు!
    ఇప్పటికే చాలా చానళ్ళలో "కెమెరా పర్సన్ గంగతో రాంబాబు" వంటి వ్యాఖ్యలు వాడుకలో ఉన్నాయి కూడా. ’మీడియా’ పై చిత్రాన్ని తీస్తున్నానని ప్రకటించిన ఆ దర్శకుడు ఇంత మౌలికమైన విషయాన్ని గ్రహించకపోవడం ఆశ్చర్యం. ఇది చాలు - ఆయన ఎంత కంగాళీగా సినిమాలు తీస్తాడో.. వృత్తి పట్ల ఆయన చిత్త శుద్ధి ఏపాటిదో ..తెలియడానికి.
    మీకు నా ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  4. అవునండి ఇప్పటి వరకూ ఆ ఆలోచనేరాలేదు.

    రిప్లయితొలగించండి
  5. అనికేత్ గారు!
    ఇప్పుడు ఆయన గారి అభిమానులు "ఆయన హీరోయిన్ ను బోయిష్ లుక్ తో చూపారు కాబట్టి అలా టైటిల్ ఉంచా"రని డొల్లతనంతో నిండిన సమర్థింపులను పలుకుతున్నారు. పోనీ ... అలాగే అనుకొందాం ... అలాంటప్పుడు "కెమెరామన్" లేక "కెమెరామ్యాన్" అని ఉండాలి గానీ ... "కెమెరామెన్" ఎలా అవుతుంది?
    ఇంకేముంది - "ఆమె ఒక్కతే అయినా, పది మంది పెట్టుగా చూపారు కాబట్టి అలా టైటిల్ ఉంచా"రని సమర్థింపులను పలుకుతారు ఆ వీరాభిమానులు. కానీయండి. మనమేం చేయగలం?
    మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి