29, మే 2014, గురువారం

పోల'వరమా' ? శాపమా ?

మూడవ పంట కోసమని ముంచగ నెంచిరి ప్రక్క రాష్ట్రమం
దేడు విశాల మండలము, లెంత విషాదము ! ఆంధ్ర నాయకుల్
గూడెపు టాదివాసులట గుండెలు బాదుకొనంగ కానరో ?
ఏడుపు కళ్ళనీళ్ళపయి ఎత్తుగ 'డ్యామ'ట ! సిగ్గు చేటయో !

7 కామెంట్‌లు:

  1. ఇది కొందరికి వరం ....కొందరికి శాపం....అంతా రాజకీయ కుట్ర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Vibhajana billu lo vunna amsaa le kadaa....ivvaalla kothaga sivaalethuthunnaru kachara mariyu ...hareesh anabade oka nikrushta raajakeeyudu.

      తొలగించండి
    2. విభజన బిల్లులో ఉన్నదే అయితే, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు? బిల్లులో ఉన్నది 111 గ్రామాలు ... ఇప్పుడు అదనంగా కలుపుతున్నది 7 మండలాలలోని 400 కు పైగా గ్రామాలు. ఇది మీకు తెలియక కాదు. ఆత్మ వంచన చేసుకొంటూ అబద్ధమాడుతున్నారు. 14 ఏళ్ళుగా మీరు చేస్తున్నది ఇదేగా! తిట్లకు దిగితే అబద్ధాలు నిజమవుతాయా? రాష్ట్రం విడిపోయాక కూడా నీచ రాజకీయాలు చేస్తున్నది సీమాంధ్ర రాజకీయ నాయకులే! అయినా ఈ అధర్మాన్ని ఆ భద్రాద్రి రాముడు ఒక కంట కనిపెడుతున్నాడు. శబరి, గుహుని వారసులైన ఆదివాసుల ఉసురు ఊరికే పోదు. ఆ నికృష్ట నాయకులకు ఏనాటికైనా తగిన శాస్తి జరుగకపోదు.

      తొలగించండి
  2. asalu matakoste avanni 1958 ki mundu andhra ki chendina pranthale kadaa.. inka meeru adanamga bhadrachalanni kalipesukunnaru. nyayamga matladithe meere dochukunnatlu. deeniki em chebutaru mari?

    రిప్లయితొలగించండి
  3. మురళీమోహన్ గారు!

    1940వ దశాబ్దంలో నిజాం రాజు భద్రాచలంతోసహా ఆ ప్రాంతాలనన్నిటినీ బ్రిటిష్ వానికి ముట్టజెప్పిన విషయం మీకు తెలియదు. సీమాంధ్రతో కలిసి ఆ ప్రాంతాలు అప్పుడు ఉన్నది పట్టుమని పదేళ్ళు మాత్రమే! అందుకే ఆ ప్రాంత ప్రజలు ఏనాడు సీమాంధ్రతో మమేకం కాలేదు. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు తెలంగాణతోనే ఉంటామంటున్నారు. వాళ్ళ అభిప్రాయానికి విరుద్ధంగా వాళ్ళను సీమాంధ్రతో ఎలా కలుపుతారు? 1956లో తెలంగాణ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా సీమాంధ్రతో కలిపిన తప్పే మళ్ళీ చేస్తే ఎలా?
    అయినా బిల్లుతో 140 గ్రామాలు సీమాంధ్రకు ఇచ్చారు. అయిపోయింది. మళ్ళీ దొంగ దారిన ఆర్డినెన్సుతో 7 మండలాలను (400ల పై చిలుకు గ్రామాలను) కలపడం న్యాయమా?
    ఇవన్నీ ఇలా ఉంటే మీరు చిన్నపిల్లల్లా " మీరు దోచుకొన్నారంటే ... మీరు దోచుకొన్నారు" అంటూ మీ అపరిపక్వతను బయటపెట్టుకొన్నారని చెప్పక తప్పదు.

    రిప్లయితొలగించండి