9, డిసెంబర్ 2015, బుధవారం

అక్షరములు!


నెలవంక రూపమే ’తలకట్టు’గా మారె –
శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె –
మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై వెల్గె –
’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి –
’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ –
’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ –
’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె –
ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె –

"ఓం నమ శ్శివాయ" యటంచు నూని యట్టి
అక్షరముల తొలుత దిద్దు నందు చేత -
అక్షరములే తెలుగు వాని కక్షతలగు
అలరి 'అక్షరముగ ' త్రిలింగావనిపయి!

5 కామెంట్‌లు:


  1. అక్షరముల లో సత్యమును గాంచిన ఫణీంద్రుడు !

    ఆచార్య వారు సాక్షాత్కరించారు సత్యాన్ని అక్షరం గా ! అక్షర రూపకం గా !

    శోభాయమానం గా ఉంది ! సూపెర్బ్ గా ఉంది !

    చీర్స్
    జిలేబి


    రిప్లయితొలగించండి
  2. జిలేబి గారు ..
    మీ అభిమానానికి అనేక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది.....కొత్తగా ఉంది

    రిప్లయితొలగించండి