5, అక్టోబర్ 2009, సోమవారం

వరియన్నము


అప్పుడ వండి వార్చు వరియన్నము పళ్ళెమునందునుంచగా
గుప్పున వేడియావిరులు కొల్లలుగా ముఖమందు సోకగా
చెప్ప తరంబె ఆకలికి చిత్తయియున్నటువాని గుండెలో
డప్పులు మ్రోగినట్లగును - డాసినయట్లనిపించు స్వర్గమున్ !

6 వ్యాఖ్యలు:

 1. నాకా బొమ్మచూడగానే ఆకలి వేసింది.పద్యం చదవగానే నోరూరింది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ పద్యం,చిత్రం చూడగానే వరద బాధితులు గుర్తొచ్చారు. వారికి ఆహారాన్ని ఇలా వేడిగా అందజేయగలిగితే.....వారికి కలిగే అనుభవమే ఈ పద్యం

  ప్రత్యుత్తరంతొలగించు
 3. విజయ మోహన్ గారు !
  నిజమే ! నేను వ్రాసింది
  " ఆకలికి చిత్తయియున్నటు వారి " గురించే -
  మీ కరుణా హృదయం గోచరమయింది.
  ధన్యవాదాలు !

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వేదుల వారికి
  వినమ్ర పూర్వక నమోవాకాలు !

  ప్రత్యుత్తరంతొలగించు