12, అక్టోబర్ 2009, సోమవారం

మత్తు


మందు త్రావినపుడె మత్తెక్కునను మాట
ఉత్త మాట ! వట్టి చెత్త మాట !
మంచి కవిత గ్రోల, మత్తెక్కు నాకెంతొ -
దిగదు మత్తు త్వరగ ! దిగదు ! దిగదు !

8 వ్యాఖ్యలు:

 1. అంతగా మత్తు నెక్కించు నట్టి కవిత
  నెద్ది చదివితి రీమధ్య నెచట దొరికె?
  పెగ్గు కయ్యెడి కర్చు తప్పించు కవిత
  కానవచ్చుట నాకు భాగ్యంబు గాదె.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కవి సోదరా !
  కంది శంకరయ్యా !
  నమః

  పానమందున పగలెల్ల స్నానమాడి,
  రేయి ’ పాన శాల ’ కయి తిరిగి వెదికెడు
  త్రాగుబోతును తలపింప తగునటయ్య ?
  మధుర కావ్య పాన విశేష మత్త చిత్త !

  చదివినంత ’ శేషేంద్ర ’ వచన కవితల,
  ’ దాశరథి ’ కవి వరుని పద్య కవితలను -
  మత్తు మస్తిష్కమం దెక్కి చిత్తు సేయు !
  దిగదు రెండు, మూడు దినముల్ దిగదు నాకు !

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కొత్త పాళీ గారికి
  ధన్యవాద పూర్వక వినమ్రాంజలి !

  ప్రత్యుత్తరంతొలగించు