6, జులై 2010, మంగళవారం

సుఖ భోగము ...కలిగిన నవ్య భావనల కమ్మని పద్యములట్లు కూర్చుచున్,
చెలగి కవిత్వ సాధనము చేయుచునుండెద - అట్టి వేళలో ...
తొలకరి వానలో చినుకు తుంపరలై ముఖమెల్ల చిందగాన్,
పులకర మందజేయు సుఖ భోగమునందున తేలి నట్లగున్ !

2 వ్యాఖ్యలు:

  1. వదలక నా ప్రతి 'పోస్టు'ను
    ముదమున దర్శించి మీరు ప్రోత్సాహమిడన్ -
    మది కానందము కలుగు! స
    హృదయ శ్రేష్ఠ! 'హను' నామ! ఇదె అభివాదాల్!

    ప్రత్యుత్తరంతొలగించు