24, జులై 2010, శనివారం

సిగ్గు! సిగ్గు !!

మాయ మాటల మాంత్రిక నాయకు లిట
చాటగా ’సమైక్యత’ గూర్చి, జంకుచుందు
రెన్నికల వేళ! రేపోడునెడ ’తెరాస’ -
"లేదు తెలగాణ వాదమే లేద" టంచు
చెప్పవత్తు రీ నేతలే - సిగ్గు! సిగ్గు!

3 వ్యాఖ్యలు:

 1. చంద్ర బాబు చిరంజీవి జయ ప్రకాషు
  బాధ నర్థమ్ము చేసికో వచ్చు కాని
  శ్రీనివాసుని ద్రోహమ్ము జీవితమున
  మారవగాలేరు తెలగాణ మనుషు లెల్ల

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు హరి గారు! డి.శ్రీనివాస్ హైకమాండ్ చెప్పుచేతల్లోని మనిషి. వెన్నెముక లేని పదవిలో ఉన్నాడు. మిగితావారు అలా కాదు. వారి వారి పార్టీలకు వారే హైకమాండ్. నిజంగా తెలంగాణలో సమైక్యవాదులు అధికంగా ఉన్నారని నమ్మితే - చిరంజీవి, జయప్రకాశ్ నారాయణ్ ఈ ఎన్నికలను తప్పించుకొని పారిపోనక్కర లేదు.తెలంగాణను అడ్డుకొన్న చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు అనుకూలమని ప్రచారం చేసుకోనక్కర లేదు. ఒక్కరికీ ఎన్నికల వేళ తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యవాదాన్ని ప్రబోధించే దమ్ము, ధైర్యం ఉండవు. ఈ సమయంలో లగడపాటి, కావూరి, జే.సి. వంటి వాళ్ళ నోళ్లకు కూడా మూతలు పడతాయి. కాని, రేపు తెలంగాణలోని పేదరికాన్ని, అమాయికత్వాన్ని expliot చేస్తూ - డబ్బు, మద్యం పంచడం ద్వారా, లేక, "మేమూ తెలంగాణకు అనుకూలమే" అని మాయ మాటలు చెప్పడం ద్వారా 'తెరాస'కు ఒకటి, అర సీట్లు తగ్గించగలిగితే ... వీళ్ళంతా చేసే వీరంగం చూడండి - నా సామి రంగా! అప్పుడు వీళ్ళను చూసి కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని అమాయిక సమక్య వాదులు నిజంగానే తెలంగాణవాదం నామ మాత్రంగానే ఉందనుకొంటారు. తెలంగాణ వచ్చినా, రాకపోయినా - నా బాధంతా ... ఈ నాటకాలు కొనసాగినంత కాలం తెలంగాణలో ఇంకెన్ని పసి మొగ్గలు ఆత్మహత్యలతో కాలి బూడిదవుతాయో ... అని. కఠిన శిలలు కన్నీటి చుక్కలను రాల్చలేవు కదా!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సార్,

  మిగతా ముగ్గురి విషయంలో మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వారు రహస్య ఎజెండాతో వారి వారి పార్టీలను (చిరంజీవిది ప్రత్యక్ష ఎజెండానే) ప్రభావితం చేస్తున్నారనేది బహిరంగ రహస్యం.

  కాని డీశ్రీనివాస్ గారి ప్రవర్తన చూడండి.

  అధిష్టానం పోటీ చేయమని చెప్పినా తనకు బదులుగా నిజామాబాదులో వేరొకరిని నిలుప వచ్చు. ఒక వైపు తెలంగాణాని తెచ్చేది నేనేనని నమ్మ బలుకుతూ తెలంగాణా వాదాన్ని దెబ్బ తీయడానికి సర్వ శక్తులూ ఒడ్డి (అవినీతి) పోరాటం చేస్తున్నాడు.

  ప్రత్యుత్తరంతొలగించు