13, ఆగస్టు 2011, శనివారం

దౌర్భాగ్య జాతి!




ఒక్క ప్రాణం బుడుగ జూచి యూరుకొనక,
లండను నగరం బెల్లయున్ మండుచుండె!
ఆరు వందల ప్రాణంబు లారిపోవ,
పట్టనట్లుం డిట మన దౌర్భాగ్య జాతి!

52 కామెంట్‌లు:

  1. కాకిలెక్కన ఆరువందలనుచు
    శవంబుల మీద పేలాలు ఏరుకునే
    మీది దర్భాగ్యపు జాతే

    రిప్లయితొలగించండి
  2. శంకర్ గారు!
    మీది, నాది - మనందరిదీ ఒకే దౌర్భాగ్య జాతి!
    కొంచం లెక్క తక్కువని తేలితే ... కొంచం తక్కువ దౌర్భాగ్య జాతి!
    సరేనా ?

    రిప్లయితొలగించండి
  3. SIVARAMA PRASAD garu!
    Can we link up and analyse the following situations with that theory?
    A. Non availability of drinking water to the people suffering from florosis in Nalgonda Dist.
    B. Availability of water for 3rd crop also in neighboring Dist.s like Guntur and Krishna.

    రిప్లయితొలగించండి
  4. నిజంగానే మనది దౌర్భాగ్యపు జాతి ఎంత మంది చనిపోయ్యారు అన్నది కాదు లెక్క !!! కారణాలు ఏదైనా ఎవరైనా చనిపోయింది తెలుగు వారేగా.

    రిప్లయితొలగించండి
  5. రాజశేఖర్ గారు!
    మీ సహృదయ శీలానికి ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  6. ఏ? పాపం తమరి మానసిక దౌర్భాగ్యం విషయం వచ్చేసరికి 'మనదీ అనుచున్నారే. మీరు వేరు, మేము వేరు అనే సిద్దాంతం ఏమైనది స్వామీ? అక్కడ గొడవలకు ఆ మరణం ఒక అగ్గి మాత్రమే.. ఆ తర్వాత జరిగినవి పూర్తిగా వేరు విషయాలకు సంభందించినవి. అయినా ఆత్మహత్యల్నే ధుర్భలత్వాన్ని అమరత్వం తో ఊరేగించే ధౌర్భాగ్యపు నేతలకు వంత పాడేది ఏ జాతి?

    రిప్లయితొలగించండి
  7. A. Non availability of drinking water to the people suffering from florosis in Nalgonda Dist.

    How many villages in Nalgonda are still affecting with non-avaialability of drinking water?

    B. Availability of water for 3rd crop also in neighboring Dist.s like Guntur and Krishna.
    How many acres are getting water for 3rd crop?

    ఇంకెన్నాళ్ళు స్వామి ఈ పనికి మాలిన ఆరోపణలనించి తెలంగాణ జాతి కి మోక్షం? మీ కాకి లెక్కలు కలకాలం చెల్లించుకోవాలనే ఆశ తీరక ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు తెలబాన్ నేతలు.. మీ అబద్దాల పుట్ట బద్దలవక ముందే రాష్ట్రం ఏర్పరుచుకోవాలనే పగటికలలు కంటున్నారు. కాని ఈ సరికే చేరాల్సిన వారికి ఈ ఉద్యమ ముసుగు లోని కాకి లెక్కల నిజస్వరూపం అర్ధమైంది.

    రిప్లయితొలగించండి
  8. acharya phaneendrulu laanti aacharyulu vundadam valana ne manadi dourbyagapu jaati ayyindi, visha pu lekkalu chimmi, aatma hatyalaki kaarakulayaru....chi meedi oka janmena? sigguleni janma, naa post delete chsinanta maatrana, nuvvu chimmedi amrutam avadu..

    రిప్లయితొలగించండి
  9. సత్యా గారు!
    కొన్ని దశాబ్దాలుగా భాషాపరంగా ‘జాతి‘ శబ్దాన్ని ప్రయోగిస్తూ ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నారు.
    ‘జాతి‘ అన్నది నిజానికి జాతీయ వాచకం. మనందరిదీ ‘భరత జాతి‘ అని నేను అనుకొంటున్నాను. మీరు వేరే అనుకొంటున్నారేమో నాకు తెలియదు.
    ఇక నీటి సమస్య - ఎంతో కొంత - సమస్య అయితే ఉంది కదా! అది అంత తక్కువ మోతాదులో ఉన్నట్టయితే ... మరి మీరన్నట్టు ఆ కాకి లెక్కలను వాళ్ళకో, వీళ్ళకో చేర్చి రాజకీయాలు చేసే బదులు, ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి చేర్చి ఆ చి.......న్న సమస్యను పరిష్కరింప జేసి, పుణ్యం కట్టుకొని, తద్వారా ఉద్యమ ప్రభావం ప్రజలలో లేకుండా చేయండి ... ప్లీజ్!

    రిప్లయితొలగించండి
  10. సర్. అంటే మొత్తం రాష్ట్రాన్ని లంకా దహనం చేయాలనా మీ ఉద్దేశ్యము. పండితులైన మీరు కూడా సంకుచితభావంతో తెలుగుజాతికి తెలబాన్లు పట్టించిన దుర్గతిని సమర్థించటం చాలా బాధాకరం. మూడోపంట పండించేవారు crop holiday ప్రకటించే దుస్థితిలో ఉన్న విషయం మీరు చూడటంలేదా. వరదలొస్తే పంటలు కొట్టుకుపోయేది తెలంగాణాలోనా ఆంధ్ర ప్రాంతంలోనా. తెలంగాణాకు కొన్ని అన్యాయాలు జరిగి ఉండవచ్చు. అంతకంటె దైన్య స్థితిలోఉ న్న అనంతపురం మీకు కనిపించదా. తమది అనుకుని రాజధానితొ ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలు పెంచుకున్న అనుబంధాన్ని తెంచటం మీకు న్యాయంగా అనిపిస్తూందా? సాటి తెలుగువారి మీద ద్వేషాన్ని నూరిపోస్తున్న తెలబాన్లను చక్కదిద్దటమ్ పెద్దలుగా మీ బాధ్యత.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా కుహనా ‘సమైక్యా‘!
    ‘సమైక్య‘ పదంపై కూడా అంత కసి ఎందుకు నాయనా? ‘క‘ ను అంత ఒత్తకు -
    అవును ... దీనులు, బాధా తప్తుల కష్టాలకు చలించి కవిత్వం వ్రాసే నాదీ ఒక జన్మేనా?
    నాలుగు దొంగ మాటలు చెప్పి చప్పట్లు కొట్టించుకొంటే అది మీకు జన్మ!
    మరి నాకు అలాంటి జన్మల్ని చూస్తే ... శ్రీశ్రీ అన్నట్టు “మనదీ ఒక బ్రతుకేనా? సందులలో గొందులలో - పందుల వలె - కుక్కలవలె - “ అనిపిస్తుంది. అవన్నీ మీకు అర్థం కావులెండి.
    ఇంకా మరో ఆభాండమా? నేను నీ post delete చేసానా?
    అసత్యవాది నశించు గాక! సత్యవాది జయించు గాక!

    రిప్లయితొలగించండి
  12. అంటే లండన్‌ను తగలబెట్టిన, దోచుకున్న దుండగుల మూకల్లా విజృంభించి హైదరాబాదు నగరాన్నికూడ తగులబెట్టితే మనది సౌభాగ్యపు జాతి అవుతుందా? ఫ్లొరోసిస్‌ బెడద కడప జిల్లాలోకూడ వుందని ఆచార్యులవారికి తెలియదేమో. పీఠభూముల్లోనూ, ఎడారుల్లోనూ నీటికొరతకూ, డెల్టా ప్రాంతాల్లో నీటి అందుబాటుకూ తేడాలు, కారణాలు తెలియనంతటి అమాయకులు కారే,మరి ఈ వ్యాఖ్యల లోగుట్టు ఏమిటో? ప్రాంతీయోన్మాదం వీడి ఆలోచిస్తే అన్ని సమస్యలకూ సవ్యమైన పరిష్కారాలూ, సకల జనులకూ సంక్షేమ మార్గాలూ కనిపిస్తాయి.

    రిప్లయితొలగించండి
  13. జాతి శభ్దాన్ని ఎలా 'ప్రయోగించాలనే దానిపై నిర్ధుష్టమైన విధానమేమి లేదు, అలాంటి అవసరం కూడా లేదు. సమయాన్ని బట్టి, సంధర్భాన్ని బట్టీ అది మారుతుంటుంది. అది తెలుగు జాతి అవ్వచ్చు, భరత జాతి అవ్వచ్చు, లేదా ఆర్య జాతి అవ్వచ్చు, లేకపోతె మనుష్య జాతి అయినా అవ్వచ్చు. అది సంధర్భ విహితం.

    మీరేదొ అబద్దాల కలలు కంటూ ఆత్మహత్యలకు పురిగొల్పటమేమిటి... దానికి మొత్తం భరత జాతి దౌర్భాగ్యం అనటం ఏమి విఙ్ఞతో మీకే తెలియాలి. దేశం మొత్తం మీద జరుగుతున్న అరాచకాలకు తెలంగాణ వాదులేమైన స్పందిస్తున్నారా.. మీ గోడు అందరికి పట్టటానికి.. పోనీ నిజాలు విచారించటానికి కమిటీలు వేస్తే, అది మేము చెప్పినట్లు రిపోర్ట్లు ఇస్తే ఆమోదిస్తాము, లేకపోతే చెత్తబుట్టలో వేస్తాం. ఇదీ నిష్పాక్షికత అనే పదానికి తెలబాన్ నేతలిచ్చే గౌరవం.

    లెక్కలడిగే సరికి 'ఎంతో కొంతా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే? నల్లగొండ లో ప్రస్తుతం అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం ఉంది. By 2000 itself most of the fluoris problem has been solved in nalgonda and as of today all the villages are provided with krishna water. కానీ మనకీ నిజాలు అనవసరం, ఎవరో ఒకడ్ని దుర్మార్గుడిగా చూపించి పబ్బం గడుపుకోవాలి. పోనీ మీరు చెప్పిన 'ఎంతో కొంతా సమస్య అనుకున్నా అది నల్లగొండ ఒక్క జిల్లా ది కాదే.. రాష్ట్రం మొత్తం మీదా, ఆ మాటకొస్తే దేశం అంతా దీని బారిన పడిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మీరు చెప్తున్న మూడు పంటల జిల్లాలో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఒక రాష్ట్ర సమస్య కి ప్రాంతీయ రంగు పులిమి విద్వేషాలు రగిలించాలనుకుంది మాత్రం మీ తెలబాన్ నేతలే.. అందుకు వంత పాడేది మీ లాంటి ఆచార్యులు. పోనీ అంత ప్రేమే ఉంటే నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నాగార్జున సాగర్ లో 96TMC ల వాటా ఉంది. అందులో కేవలం 5 నించి 10 TMC లు మీ రైతులు వదులుకుంటే ఆ గ్రామాలకు మంచి నీరు ఇవ్వొచుగా.. మీ సొంత ప్రజల కోసం ఆ మాత్రం చెయ్యలేని తెలంగాణ నేతలు పక్కన వాళ్ళని విమర్సించటం సిగ్గుచేటు..

    రిప్లయితొలగించండి
  14. The total number of districts endemic for Fluoride / Fluorosis are: • Cuddapah • Hyderabad
    • Krishna • Medak • Warangal • Ananthapur • Karimnagar • Kurnool • Nalgonda
    • Prakasam • Chittoor • Guntur • Khammam • Mahbubnagar • Nellore • Rangareddy
    Source: http://www.fluorideandfluorosis.com/Fluorosis/Districts.html
    అంటే 23 లోంచి 16 జిల్లాల్లో ఈ ఫ్లొరోసిస్‌ బెడద, తరతమభేదాలతో, వుంది అని ఆచార్యులవారు తెలుసుకొనగలరు.

    రిప్లయితొలగించండి
  15. ఆచార్య ఫణీంద్ర గారూ నమస్కారం,

    ముందు వెనుకలు ఆలోచించకుండా అమాయకంగా నేతల మాటల మాయాజాలం లో పడి ఆత్మహత్యలు చేసుకున్నది ఆవేశం మెండుగా ఉన్న యువతే గానీ విజ్ఞత కలిగిన వారు ఒక్కరైనా మరణించారా ఆచార్య గారూ? ఆ మరణాలకి అర్ధం ఉందంటారా? వాటిని ప్రోత్సహిస్తున్న నాయకుల తీరును మీరు సమర్ధిస్తున్నారా?

    "A. Non availability of drinking water to the people suffering from florosis in Nalgonda Dist.
    B. Availability of water for 3rd crop also in neighboring Dist.s like Guntur and Krishna."

    నాకు లేదు, పక్కవాడికి ఉంది అన్న ఏడుపు ఇందులో స్ఫురించటం లేదంటారా? అతి వృష్టి, అనా వృష్టి తో మీరు సుభిక్షమనుకుంటున్న ప్రాంతం లో మరణించిన రైతుల సంఖ్య లెక్కవేస్తే మీరు చెప్తున్నా ఆరొందల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువుంటుందన్న విషయం తమకు తెలియదా? సమస్యలని ఎదుర్కోలేక ఆత్మహత్యే మార్గం అనుకున్నవాడు ఎవరైనా భీరువే. అది అక్కడ రైతైనా, ఇక్కడి యువతైనా.

    రిప్లయితొలగించండి
  16. Nenu 'Ka' ni vathanu, Mee kaaki lekkala tho Amayakula Peeka vatharu,.......Andhra, Raayala seemallo prajalu entha kastalu padutunnaro nenu cheppanu, ee prantha kastalu aa pranthani ki vunnayi...ee floride baadha okka nalgonda jilla lo ne ledu, Andhra prantham lo floride baadhalu ekkadekkada vunnayo meeku telusa? entha pedarikam vundo meeku telusa? sunamilu Andhra ke vastunnai ani meeku telusa? raayala seema edari ga maarutondanna vishayamu meeku telusa?

    Tamari laanti vignulu kuda kaaki lekka lu maatladithe......aa mahanu bhavudu sri sri annatu “meedi ఒక బ్రతుకేనా? సందులలో గొందులలో - పందుల వలె - కుక్కలవలె -“ nijam chepinantha maatranna meeru Telangana drohi avaru........

    రిప్లయితొలగించండి
  17. By 2000 itself most of the fluoris problem has been solved in nalgonda and as of today all the villages are provided with krishna water

    హతవిధీ! నల్లగొండ జిల్లావాసిని నాకు తెలియకుండా నల్లగొండలో ఊరూరికీ క్రిష్ణా నీల్లిస్తున్నారా? అదికూడా 2000 సంవత్సరంలోపే చాలావరకూ జరిగిందా? అసత్యాలకు అవధులు లేకపోతున్నట్టున్నాయి?? మరీ ఇన్ని కట్టు కధలా? ఎంత సమైక్యవాదం అబద్దపు వాదమయితే మాత్రం దాన్ని సమర్ధించుకోవడానికి ఇంత పచ్చి అబద్దాలు ఆడాలా?

    రిప్లయితొలగించండి
  18. Combating Fluorosis – Andhra Pradesh

    Excess fluoride in drinking water sources in Anantapur district of Andhra Pradesh has made the area’s marginalised, rural population vulnerable to fluorosis.

    UNICEF has introduced domestic de-fluoridation filter units, which can be used in homes to remove excess fluoride from drinking water.

    Developed in collaboration with the Indian Institute of Technology, Kanpur, this easy-to-use device, where water poured into the upper chamber is collected and filtered into the lower one, reduces the fluoride content to acceptable levels.

    Source: http://www.unicef.org/india/state_profiles_236.htm

    రిప్లయితొలగించండి
  19. ఆరు నూర్ల యువకులాత్మార్పణము జేయ
    జాళి జూప నెవరి జాడలేదె?
    విగ్రహాలపైన విపరీత ప్రేమలా?
    మట్టి బొమ్మ విలువ మనిషి కేది?

    రిప్లయితొలగించండి
  20. Please go to and read: http://www.de-fluoride.net/2ndproceedings/138-145.pdf
    "HOUSEHOLD DEFLUORIDATION OF DRINKING WATER
    USING ACTIVATED ALUMINA
    C Venkobachar*, L Iyengar** and A K Mudgal***
    Kanpur and New Delhi, India
    SUMMARY: This paper deals with the development of a simple "Point of Use" domestic
    defluoridation unit (DDU) using indigenously manufactured activated alumina (AA) and its
    evaluation for adoption in rural areas in India. Different products of indigenously
    manufactured AAs were screened for fluoride uptake capacity. Using 3 kg of AA, around
    500 L and 1500 L of safe water (F- £ 1.5 mg/L) could be produced when the raw water
    fluoride was 11 and 4 mg/L respectively (alkalinity 450 = mgCaCO3/L). Exhausted AA was
    regenerated with alkali and acid using the simple `Dip procedure'. After 30 cycles of
    regeneration, the decrease in capacity was only marginal. Effect of raw water constituents
    on fluoride uptake was studied in the laboratory using simulated as well as natural waters.
    Results indicated that there was a decrease in treated water volume as raw water alkalinity
    increased. Presence of 250 mg/L sulphate in raw water decreased the AA fluoride uptake
    capacity by 15 %. Nearly 400 DDUs have been distributed in tribal areas of Dungarpur
    district in Rajasthan, India for field evaluation. Reports received till now have been very encouraging."

    This AA (domestic use filter) can be very useful for fluorosis affected villagers and hence social workers interested in Nalgonda district or anywhere may make further enquiries and procure some and make use of.

    రిప్లయితొలగించండి
  21. @Viswaroop, sorry that is a typo. I meant it by 2005.

    కట్టుకథలను మీరు మాట్లాడటం వింతగ ఉంది లే.. వాసవ్య బ్లాగులో ఉద్యోగాల్లో వివక్ష అంటూ గగ్గోలు పెట్టి లెక్కలు తీయగనే జారుకున్న మీరు ఎదుటి వారిని అబద్దాలు అనటం కలికాలపు వింతే మరి. సరే.. మీ లెక్కలే చూపండి చేతనైతే.. ఈ రోజు నల్లగొండ లో ఎన్ని ఫ్లోరోసిస్ గ్రామాల్లో త్రాగునీటి సరఫరా లేదో? అన్నట్లు మీ నల్లగొండ రైతులు తోటి గ్రామాల ప్రజలకోసం ఆ మాత్రం నీటిని వదులుకోలేరా అంటే సమాధానం లేదే?

    రిప్లయితొలగించండి
  22. @సత్య

    Even if you your typo is actually 2011 instead of 2000, it is completely lie just like you do always in contrast to your profile name. As on today only nalgonda town gets krishna water no other village and town gets any drinking water from krishna. And don't mislead others that with reducing 2TMC water from Nagarjuna sagar left canal whole district flourasis issue can be solved.

    If you don't stick to one topic and keep jumping no one has infinite time to convince you. I came to vasavya blog to answer vasavya, not any tom, dick and harry who writes as anonymous and makes out of context statements there. Why would I debate with an anonymous in a 3rd party blog, what if you use foul words in the disguise of anonymous and claim that it is not you?

    By the way your numbers about the jobs are all wrong, I only asked you to give your versions about other issues as well. You can keep spreading lies as always in your beloved blog. Don't answer me here and corrupt Acharya's blog, if you have guts come to my blog.

    అబద్దాలకోరూ, అబద్దాలకోరూ రాసుకుంటే రాలేవి అబద్దాలే!!

    రిప్లయితొలగించండి
  23. 2000 లోనే నల్లగొండలో ఫ్లోరీన్ సమస్య పరిష్కారమైతే మరి దుశ్చర్ల సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంకా ఎందుకు ఉద్యమాలు చేస్తున్నట్టో!


    మరి ఫ్లోరైడ్ మీద యుద్ధం అని చెప్పి HMTV వారి క్యాంపెయిన్ కూడా వుట్టిదేనా?

    http://www.youtube.com/watch?v=q3cShN5mhm0
    http://www.youtube.com/watch?v=dIjt-4kxIm4
    http://www.youtube.com/watch?v=ghOmEMjIThI
    http://www.youtube.com/watch?v=Qtyj1OHpBaw

    HMTV సరే, మరి TV9 మాటేమిటి?

    http://www.youtube.com/watch?v=udVXG6SNDMs
    http://www.youtube.com/watch?v=x97LZCyLB_w


    పక్కనించి నది పారుతుంటే మేం తాగునీరు కూడా కొనుక్కోవాలి. లేదంటే విషపునీరు తాగి చావాలి. అదీ (కుహనా) సమైక్యవాద న్యాయం.


    సత్యాన్వేషి గారు http://edisatyam.blogspot.com/2010/09/dasa-disalo-kanniiru-tepinche-duscharla.html పోస్టులో పెట్టిన దుశ్చర్ల సత్యనారాయణ గారి HTMV దశ దిశ తాలూకు హృదయాన్ని కదిలించే వీడియోలు కొంతమమంది సమెక్కుడు వాదులు కాపీరైట్ పేరుతో డిలిట్ చేయించి పుణ్యం కట్టుకున్నారు. కాబట్టి వాటి లింకులు ఇవ్వలేక పోతున్నాను.

    రిప్లయితొలగించండి
  24. $ఆచార్య ఫణీంద్ర ji

    Well said!

    The painful facts and root causes behind London riots:
    http://saapaatusamagatulu.blogspot.com/2011/08/blo
    g-post.html

    రిప్లయితొలగించండి
  25. @Sreekanthachari, dont worry of not founding satyanarana video. no one is interested in ur dasa-disa, dhoom-dhaam, teenmaar videos which are simply emotional crap.

    Ask your politicians how many times they raised the issue in parliament? Ask jaipal reddy about what he did for the flurosis problem in AP? what Nagam did when he is in panchayat raj minister?

    you guys are sore losers and cry over others for ur own problems.

    రిప్లయితొలగించండి
  26. ఏమంటిరి ఏమంటిరి ఆచార్య దేవా!
    1) నల్గొండలో తప్ప దేశములో వేరెక్కడను ఫ్లోరైడు మహమ్మారి మీ కంటపడలేదా? ఓ సారి ఇది తిలకించుడు. కళ్ళకు కప్పిన మందమైన వేర్పాటువాద పొరలు వూడగలవు. ఫ్లోరైడు ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పరుద్దామని మీ కవితావేశమా?
    2) ఏదీ నల్గొండపై ఎవరు ఎన్ని 'పోరాటాలు', ఎంత తీవ్రంగా చేశారో ఓ సారి వివరించండి? ఎంతమంది ఆత్మ బలిదానాలిచ్చారు?
    3) ప్రతిదానికీ ఆంధ్రోళ్ళు మా గొంతెమ్మ కోర్కెలు తీర్చాల అని ఏడిస్తే, వాళ్ళ దగ్గరేమన్నా మంత్రదండముందా? అదేవుంటే రాయలసీమ కరవు కాటకాలు, తాగునీటి ఎద్దడి పరిష్కరించుకోలేరా?
    4) 2ఏళ్ళనుండి 600మంది తేగాలు చేషిన్రు అని తవికలు రాస్తున్నారు, ఏదీ మొన్న డిల్లీలో ఉరేసుకున్నాడని చెబుతున్న యానాది రెడ్డి ని కలిపిండ్రా? 600 మేజిక్ ఫిగర్ అర్థం ఏమిటి? 1948నుంచి లెక్కలేస్తున్నారా? అంతకన్నా 10రెట్లు రోడ్ల మీద పోయుంటారులే, మరి రోడ్లను ప్రత్యేక రాష్ట్రాలుగా...
    5) ఆత్మ బలిదానాల్లో ఎంతమంది తెరాస నాయకులు, తొక్కలో తవులు, కలాకారులు, మేతావులు, ఆచార్యులు వున్నారో చెప్పండి, అమరత్వం పొందడానికి పరితపించారో, ఎందుకు పొందలేకపోయారో చెప్పున్రి.
    6) మాకూ ఫ్యాక్షన్ తగాదాల్లో 'అమరత్వం' పొందినోళ్ళున్నారు, మరి ప్రత్యేక దేశం ఇప్పిస్తరా?
    ఏమి ఆచార్యులో ఏమో, ముక్కోడు తాగి వూదరగొట్టిందే పాఠం అని వల్లె వేస్తుంటారు
    7) శ్రాకాంతాచారి పోస్ట్మార్టం తెలాబాన్లు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నారు? అమరత్వం తగ్గుతుందనా? లేబర్ పనులు చేసుకునే యానాది రెడ్డి లేఖ చక్కగా రాశాడు, లేఖలకు ఫార్మాట్ ఎవరు ఇస్తున్నరు? ;)

    మీ PhD తెలుగులోనా.. ఏ మెటలర్జీ/న్యూక్లియార్ కెమిస్ట్రీనో అనుకున్నా!

    మీ కవితలు బాగున్నాయి, కొంచెం అర్థం కూడా వుంటే సినారె లెవెలుకు ఏదో ఒకనాడు చేరుకోగలరు.

    రిప్లయితొలగించండి
  27. Satya, don't joke. I watched dasa-disa program. United Andhra protagonists talked more about Hyderabad than regional development issues.

    రిప్లయితొలగించండి
  28. ప్రతి దానికీ స్థానిక నాయకులని అడగాలని అరిగిపోయిన రికార్డులు తిప్పుతారు. కృష్ణపట్నం ఓడరేవుని స్థానిక నాయకులు చెపితేనే వృద్ధి చేశారా? తెలంగాణాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించడానికి మాత్రమే స్థానిక నాయకుల రికమెండేషన్ ఉండాలా? సత్రం భోజనానికి పెద్దారెడ్డి రికమెండేషన్ అనే సామెతలా ఉంది.

    రిప్లయితొలగించండి
  29. నా రాష్ట్రం చేసుకొన్న దౌర్భగ్యాలలో కవులకు ప్రాంతీయ తత్త్వం ఏర్పడి వీళ్లు ఎదుటివారిని విమర్శించడం, తిట్టడమే పనిగా పెట్టుకొన్నారు. అసలు సమస్యలు లేనిది ఎవరికి? మన తెలంగాణా నాయకులు, ఉద్యమకారులు, కవులు, కుహనా మేధావులు, వీళ్లు ఒక్క తెలంగాణా లోనే అన్ని సమస్యలూ ఉన్నాయి. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ మరియూ యావద్దేశమూ సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తోంది అనే భావనని సామాన్య ప్రజలలో కల్పిస్తున్నారు. ఈ రకమైన ఏడుపు ఎప్పడూ ఉంది. తమ నాయకుల చవలాయితనాన్ని, చేతకాని తనాన్ని, వారి స్వార్థ బుద్ధిని వీరెంత మాత్రమూ పట్టించు కోరు. తమ నాయకులు తమ ప్రకటనలతో మరియూ చేష్టలతో అమాయక యువతని తప్పు దారి పట్టించి వాళ్లు పిరికి వెధవల్లా ఆత్మహత్యలు చేసుకొంటే, అమరజీవి ఇంకా ఏవేవో నోరు తిరగని బిరుదాలతో పొగిడేస్తూ ఇంకొంతమంది పిరికి వెధవల చావుకి కారణమవుతున్నారు. ఆత్మ హత్య చేసుకోని చచ్చే వాళ్ళు అందరూ పిరికి సన్నాసులే . అది ఇక్కడ యువత కావచ్చు లేదా కోస్తా, రాయలసీమ ప్రాంత రైతులు కావచ్చు. పైగా చచ్చినాళ్ల గురించి ఏదో క్రికెట్ స్కోరులాగా 600 ల ఆత్మ బలిదానాలు అనే గోల ఒకటి. ఈ పిరికి సన్నాసులని శ్రీ పొట్టి శ్రీ రాములు గారితో పోలిక చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. ఆయన ప్రత్యెక రాష్ట్రం గురించి ఆమరణ దీక్షలో కూర్చొని, ఆ విధమైన రాష్ట్ర సాధన లో ప్రాణాలు కోపోయారు. కానీ ఈ పిరికి వెధవలు ఒళ్ళు కాల్చు కొని లేదా ఎవడో కిరోసిన్ పోస్తే వేరేవడో అగ్గిపుల్లగీస్తే చచ్చినాళ్ళే ఎక్కువ. పార్లమెంట్ ముందు ఉరేసుకొని ఉయ్యాలలగా ఊగి చచ్చిన యాదిరెడ్డి ఒక DCM ట్రక్ డ్రైవర్. అతను చదివినది 10 వ తరగతి. కానీ ఆ అమరవీరుడు మహాకవి కాళిదాసు మహాకవిత్వాన్ని పోలిన ఒక పది పేజీల ఉత్తరం రాసుకొని జేబులో పెట్టుకొన్నాడంటే ఆయన బతికి ఉంటే ఆయనకు కనీసం గౌరవ తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగం ఇవ్వవచ్చు. ఇంకొక విషయం ఆ ఒళ్ళు కాల్చుకొని ఆత్మహత్యలు చేసుకోన్న వాళ్ల జేబుల్లో లేదా వారి పక్కన ఆత్మ హత్యాపత్రాలు చూస్తే అప్పుడే మిల మిలా మెరిసే తెల్లకాగితాలను చూసిన తర్వాత నాకు ఆ విధంగా ఒళ్ళంతా కాలిపొయినా రిన్ సబ్బుతో రుద్దిన బట్టలగా తెల్లగా ఉన్న కాగితం యొక్క రహస్యం తెలిస్తే నేను పేటెంట్ చేయించి ఆ విధమైన కాగితాలను తయారుచేసే ఇండస్ట్రీ ని పెడదామనే ఆలోచనలో ఉన్నాను. ఆ రహస్యాన్ని ఎవరైనా చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  30. పది మంది చూస్తుండగా ఒళ్ళు కాల్చుకున్నా అవి ఆత్మహత్యలు కావని సమైక్యవాదులు అంటున్నారంటే శవాల మీద చిల్లర ఏరుకునేది సమైక్యవాదులేనని అర్థమవుతోంది. హైదరాబాద్ మీద ఆశ ముందు మనుషుల ప్రాణాలు మీకు లెక్క కాదు కదా.

    రిప్లయితొలగించండి
  31. ఫణీంద్ర గారూ,

    మీ ప్రశ్నకు సమధానం ఒక్కటే. నిజము దేముడెరుగు, నీరు పల్లమెరుగు. అంతకంటే ఏమీ లేదు.

    రిప్లయితొలగించండి
  32. ఎవరు పది మంది చూస్తూ ఉండగా ఒళ్ళు కాల్చుకోన్నది? హరీష్ రావా?ఆ విధంగా చచ్చింది ఒక్కడే ఆ పిరికి వెధవే శ్రీకాంతాచారి. ఒక్కడి ని చూపి వందలమంది అదే విధంగా చచ్చారు అంటే ఏమిటి అర్థం? ఆ చ్చినాళ్ల శవాలమీద వ్యాపారం కాదా?

    రిప్లయితొలగించండి
  33. Mr Ravindranath

    పై వ్యాఖ్య ఒక్కటి చూస్తే చాలు మీ విశాలాంధ్ర మహాసభ ఎంతటి విషాంధ్ర సభో అర్థం అవుతుంది. తెలంగాణా ప్రజలని అనుక్షణం తిడుతూ ప్రత్యేక ఆంధ్ర దేశం కావాలని డిమాండు చేసేవారిని మీ విషాంధ్ర సభలో సభ్యులుగా చేర్చుకోవడమే మీ కూటమి లోగుట్టు ఏమిటో బయట పెడుతుంది.

    మిగతా ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలు వుంటే ఎవడిక్కావాలి? మా సమస్యలు మా రాష్ట్రావతరణ తోనే ముడిపడి వున్నాయి. ఒప్పందాలను తుంగలో తొక్కారు కాబట్టి విడిపోవడానికి మాకు కారణాలున్నాయి. మీరు విలీనం చెందుదామని దేబిరిస్తే షరతులతో కలిశాం తప్ప బేషరతుగా కాదు. షరతులు ఉల్లంఘించ బడ్డాయి కాబట్టే విడిపోతున్నాం. తమరికి సమస్యలుంటే విడిపోయి పరిష్కరించుకోండి. తెలంగాణాను నిరంతరం దోపీడీ చేయడమే తమ సమస్య అయితే మాత్రం చేయగలిగింది లేదు.

    ఏమంటివి ఏమంటివి? నడిరోడ్డుమీద పెట్రోలు పోసుకొని ఆహుతయినవాడు పిరికిపందా? రాష్ట్రం వస్తే విరమించుకోవచ్చు అని భావించి నిరశన చేసిన వాడు (చివరి రోజుల్లో అన్నం పెట్టండి మొర్రో అంటూ మొత్తుకున్న వాడు) వీరాధి వీరుడా? వద్దనుకున్నా, అనవసరంగా మీ తొండి వాదనలతో ఆ పెద్దాయన్ని వేలెత్తి చూపేలా చేస్తున్నారు.

    నడిరోడ్డు మీద పెట్రోలు పోసుకొని ఆహుతి కాగలిగిన వాడు అదే వంటికి బాంబు కట్టుకుని విద్వంసం కూడా సృష్టించ గలడు. కాని తెలంగాణా వాదులది ఆ స్వభావం కాదు. ఆ స్వభావం పది రోజుల కుహనా ఉద్యమంలో పది సంవత్సరాల తెలంగాణా ఉద్యమంకన్నా ఎక్కువ విద్వంసం సృష్టిన సమెక్కుడు వాదులది ఆ సంస్కృతి.

    తమరికి యాదయ్య లేఖ మంటల్లో ఎందుకు కాలి మసైపోలేదా అని మహా దుగ్ధగా వున్నట్టుంది. అదే విషయం అన్ని బ్లాగుల్లో పదే వ్రాస్తున్నారు. మీకు ఓపికుంటే ఆ కేసు రిజిస్టరైన పోలీసు స్టేషన్లో సమాచారం తీసుకోండి. నిజం తెలుస్తుంది. ఆ లేఖ అతని వంటి పై దొరకలేదు, అతని బ్యాగులో దొరికింది.

    మీ కొంగజపాల జగన్ దొంగ గుండెపోట్ల లెక్కల్లా కాదు. ప్రతీ ఆత్మహత్యా (తమ సీమాంధ్ర పాలనలో వున్న) సంబంధిత పోలీసు స్టేషన్లో రికార్డై వుంది. దానికి సాక్ష్యాలున్నాయి. చేతిరాత సరిచూడడం జరిగింది. మీకు చేతనైతే కావాలంటే అవి తప్పని సాక్ష్యాలతో నిరూపించండి.

    చివరిగా ప్రాంతీయ తత్వం గురించి. ప్రాంతాన్ని ప్రేమించ గలిగిన వాడే దేశాన్ని, ప్రపంచాన్ని గూడా ప్రేమించగలడు. ప్రాంతాన్ని కాక పరాన్నభుక్కులు ఇచ్చే కుక్క బిస్కట్లకు ఆశ పడే దౌర్భాగ్యుడు డబ్బుకోసం కన్నతల్లిని గూడా తాకట్టు పెట్టగలడు. తమ గ్రూపు సభ్యుల ప్రత్యేకదేశవాదం అలాంటిదే.

    రిప్లయితొలగించండి
  34. ఒక కారణం కోసం ఒకడు ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయం కూడా చెప్పొద్దన్న మాట! అంటే మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు గడించే వారికి, వారి మోచేతి నీళ్ళు తాగుతూ విచిత్ర మహాసభలు ఏర్పాటు చేసే వారికి అన్నీ వ్యాపారం లాగానే కనపడతాయి మరి!

    రిప్లయితొలగించండి
  35. సమైక్య రాష్ట్రం కోసం ఒక్క సమైక్యవాద విద్యార్థైనా పది మంది చూస్తుండగా పెట్రోల్ పోసుకుని తగలెట్టుకోగలడా? ఆ ధైర్యం సమైక్యవాదులకి లేదు. ఆకలితో ఉన్నవాడే ఆత్మహత్య చేసుకుంటాడు కానీ పీకల దాక తిన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు.

    రిప్లయితొలగించండి
  36. There is no need to argue what prompts a person to commit suicide.Over 1 millon die of and another 10-20 million attempt suicide every year worldwide. Many scholory studies are available all over .It was identified about 90% of those who commit suicide has a mental disorder. The predominant view of modern medicine is that suicide is a mental health concern, associated with psychological factors such as the difficulty of coping with depression, inescapable suffering or fear, or other mental disorders and pressures. Movements like these are at best one more reason but are certainly not the root cause to take one's life.
    http://www.biomedcentral.com/1471-244X/4/37

    http://psycontent.metapress.com/content/ek8w74718q375804/

    రిప్లయితొలగించండి
  37. విశాలాంధ్ర బ్లాగ్‌లో IMS గారు తెలంగాణావాదుల గురించి చాలా చెత్తగా వ్రాసిన కామెంట్ చదివాను. తెలంగాణావాదులని ఖలిస్తానీలతో పోల్చాడా పెద్ద మనిషి. కేవలం భాష పేరు చెప్పి రాష్ట్రాన్ని విభజించకూడదు అని ఉద్యమం నడిపేవాళ్ళని ఓ ప్రశ్న అడుగుతాను. సమాజం గురించి ఆలోచించకుండా మెటాఫిజికల్‌గా బతికేవాళ్ళు ఎక్కువగా ఉన్న దేశంలో కేవలం భాష సమైక్యత కోసం ఉద్యమాలు నడుపుతారంటే అది నమ్మశక్యంగా ఉందా? భాష అనేది అనేక ఐడెంటిటీలలో ఒకటి కానీ అది ప్రధాన ఐడెంటిటీ కాదు. కేవలం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్స్ ధరలు పడిపోకూడదని ప్రాంతీయ అభివృద్ధి గురించి ఆలోచించకుండా రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే తెలంగాణావాళ్ళే కాదు, మెజారిటీ కోస్తా ఆంధ్రులు కూడా ఒప్పుకోరు. అందుకే నేను కోస్తా ఆంధ్రలో ఉంటున్నా ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికే మద్దతు ఇస్తూ ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  38. తెలంగాణావాళ్ళపై విషం చిమ్ముతూ వాళ్ళని మనతో కలిసి ఉండమంటే ఎలా ఉంటారు? తెలంగాణావాళ్ళని తెలబాన్‌లు అనీ, ఖలిస్తానీలనీ ఇలా చాలా చెత్తగా తిడుతున్నా వాళ్ళు మనతో కలిసి ఉంటే వాళ్ళే సిగ్గులేనివాళ్ళు అని అర్థం వస్తుంది. తెలంగాణావాళ్ళు ఈ మాత్రం ఆత్మాభిమానం లేనివాళ్ళు అని అనుకోవద్దు.

    రిప్లయితొలగించండి
  39. /ఒక్క ప్రాణం బుడుగ జూచి యూరుకొనక,
    లండను నగరం బెల్లయున్ మండుచుండె! /

    ఒక్కడు చస్తేనే అంత పని చేసారు లండను వాళ్ళు. 600 చచ్చినా ఈ చచ్చు తెలంగాణా వాళ్ళు ఆపని చేయడం లేదు. ఇంత డైరెక్ట్ గా చెప్పినా అర్దం కావట్లేదు తెలంగాణా వాళ్ళకు అంటే ఆంధ్రా వాళ్ళు చెప్పేది నిజమే. తెలంగాణా వాళ్ళకు బుర్ర లేదు. తెలబాన్లూ ..ఇప్పటికైనా నిద్ర లేవండి. లండను తరహా దౌర్జన్యాలు మొదలు పెట్టండి. ఆచార్యుల వారూ ..ఇలా సూటిగా చెపితే మన వాళ్ళకు అర్దం కావచ్చు. ఏమంటారు ?

    రిప్లయితొలగించండి
  40. http://telugu.stalin-mao.in/65487999 ఇది చూసి చెప్పండి, ఎవరిది ప్రాంతీయ దురహంకారమో.

    రిప్లయితొలగించండి
  41. Ayya Sarma garu, udyama teevratha chavulatho kolavaru, meelanti moorkula medhadu antha kante edagaledu kaabatte intha mandhi chacharu, raastramu samikyamu ga vunnapudu chavavalan sina avasaramu enti? .........meere raasaru "తెలంగాణావాదుల గురించి" ani daanardamu Telangana vallandaru kadu....pidikedu తెలంగాణావాదుల గురించి ani mee laanti unmaadulani, ugravaadulani maamulu telangana prajala tho kalupu ko kandi....tulasi vanam lo ganjaayi mokkalu meerantha .......meelanti vaallani terrorists aney antaru, taalibanlaney antaru, Khalistan aney antaru.......Phaneendra laanti vishapu kavulani unmaadulane antaru..... neelanti vaadini moorkudu aney antaru...

    రిప్లయితొలగించండి
  42. @Sarma, and @Uttha Phaneendara edi meelanti moorkulaku

    http://www.newsofap.com/newsofap-26780-21-trs-leader-b-suman-slaps-person-on-tv.html

    Self Explanatory ...

    రిప్లయితొలగించండి
  43. ఒక జగన్ వర్గీయుడు లగడపాటిని "నువ్వు హైదరాబాద్‌లో ఉన్న నీ ఆస్తుల ధర కాపాడుకోవడానికే సమైక్యవాద ఉద్యమం నడుపుతున్నావు" అని అంటే లగడపాటి అతన్ని కొట్టలేదా? మేము చేస్తే ప్రాంతీయ సమైకయతా రాగం, మీరు చేస్తే ప్రాంతీయ గజ్జి అని అంటే తెలంగాణావాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు?

    రిప్లయితొలగించండి
  44. అయ్యా శ్రీకాంతాచారిగారు , యాది రెడ్డి చచ్చింది ఉరేసుకొని. ఒళ్ళు కాల్చుకొని చావలేదు. మిగిలిన వాళ్ళలో ఒళ్లుకాల్చుకొన్న వారి గురించి నేను చెప్పాను. మీరు చెప్పినట్లుగా మిగతా ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు మాకు అనవసరం అంటున్నారే, మీరు చెప్పిన విధంగానే మీ నిజాం నవాబు మిమ్మల్ని కడగండ్ల పాలు చేస్తున్నపుడు ఆంధ్ర ప్రాంతం లోని వారు, సర్దార్ వల్లభాయి పటేల్ అనుకోని ఉంటే, మీరు అమితంగా ప్రేమించే నిజాం గారు మిమ్మల్ని ఎంత గౌరవంగా చుసేవారో, మీ బతుకులు ఎంత బాగా ఉండేవో ఊహించుకోండి.. చేసిన సహాయాల గురించి మరిచిపోవడం అంటే పాలు పోసిన చేతినే కాటువేసే రకం అన్నమాట. ఇంతకాలమూ భారతప్రభుత్వం తెలంగాణా వేర్పాటు వాదులు అనే విష సర్పాలకు పాలు పోసిన్దన్నమాట. అయ్యా, ఒకడు ఒళ్లు కాల్చుకొని చస్తే ఆత్మాహుతి అని అనం. ఆత్మ హత్య అంటాము. ఆ విధంగా పెట్రోల్ పోసుకొని చావడమే ధైర్యం అనుకొంటే, మీ హరీష్ రావు ఆ రోజు తన మీద పెట్రోలు పోసుకొని ఎందుకు అంటించుకోలేదు? అంతమంది లో అగ్గిపుల్లె కరవయ్యిందా? లేక నాలాగా, మీలాగా తాను కూడా పిరికి సన్నాసి కాబట్టి చేసుకోలేదా?

    రిప్లయితొలగించండి
  45. meedi gajje, meeru maatledi udreka pariche unmaadamee.....ikkada meeru ante moorkulu ayna meelanti vaarini veerpatu vada viswasamu leni kukkalane antaru........

    రిప్లయితొలగించండి
  46. ఒక్క ప్రాణం పోతే లండన్ ప్రజలు ఎంత చైతన్యాన్ని చూపారు. భారత దేశంలో ఇంతమంది ప్రాణాలు పోయినా అటు ప్రభుత్వానికి గాని, ఇటు ప్రజలలో గాని కించిత్తు చలనం లేదు. ఇంకా కొనసాగుతున్న ఈ దారుణ కాండను ఆపేందుకు ఎటువంటి ప్రయత్నం జరుగడం లేదన్న ఆవేదనతో వ్రాసిన చిన్న కవితకు ఎవరికి తోచిన వక్ర భాష్యాలు వారు చెప్పి, ఇష్టం వచ్చిన రీతిలో మలుపులు తిప్పి, నన్ను బండబూతులు తిట్టారు. ఉద్యమంలో అతివాదులు కొందరు ద్వేషం చిమ్ముతున్నారన్న సాకుతో నాలాంటి మితవాదిపై ద్వేషాన్ని వెళ్ళగ్రక్కారు. ఇంత చర్చలు జరిపి ఏం తేల్చారు? ఇరు వర్గాలు కావలిసినంత విషం చిమ్ముకొన్నారు. ఇలా విద్వేషాలు పెంచుకొంటూ రెండు ప్రాంతాలు కలసి ఉండవలసిన అవసరం ఉందా? ఒక వేళ ఎవరైనా చచ్చినట్టు కలసి ఉండాలని అంటే - అది ఆధిపత్య ధోరణే!

    రిప్లయితొలగించండి
  47. చైతన్యంతో కూడిన నిరసనలు లండన్ లో విధ్వంసకరంగా మారితే మన దేశంలో కూడా విధ్వంసకరంగా మారాలని నేనన్నానా? ఇప్పుడు అన్నాహజారె విధ్వంసమే చేస్తున్నారా? కాని ఇన్ని ప్రాణాలు పోతున్నా (ఇప్పటికీ రోజుకు ఇద్దరు, ముగ్గురు చస్తున్నారు), మరీ పట్టనట్టు ఈ దేశ ప్రజలు, కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటున్నాయి - అనే నా ఆవేదన. వీళ్ళందరికీ తాము అక్రమంగా సంపాదించిన ఆస్తులే మనుషుల ప్రాణాల కన్న విలువైనవా? - అనే నా ఆక్రోశం.
    అయినా, తెలంగాణ ప్రజలు తమను తాము హింసించుకొంటున్నారు గాని, తోటి సోదరులకు కించిత్తు హాని తలపెట్టని సహృదయులు. సంకుచిత స్వభావులు నేను ఈ సందేశాన్ని తెలంగాణ వాళ్ళకు అందించాననుకొంటున్నారు. ఈ దారుణ కాండను సహృదయులైన సీమాంధ్రులతో బాటు మొత్తం భరత జాతి ఎలా సహిస్తూ, పట్టనట్టూ ఉంటున్నది? - అన్నదే నా ప్రశ్న! దీనికి తొందరగా పరిష్కారం దొరికి ఈ మారణ కాండను ఆగాలని నా కోరిక.
    ఇది జనరల్ డయ్యర్ అంశ కలిగిన కొందరు బ్లాగర్లు అర్థం చేసుకోకుండా నాలాంటి వాళ్ళను అవహేళనలు, దూషణలు చేస్తూ వికటాట్టహాసం చేస్తున్నారు.
    ఒకరు చెప్పితే ప్రజలు ప్రాణాలు తీసుకొంటారనుకోవడం వీళ్ళ మూర్ఖత్వం. నిజానికి ఇలాంటి అభినవ డయ్యర్ల అవహేళనలు దూషణల వలన తెలంగాణలో ఆత్మ హత్యలు అధికం అవుతున్నాయి. పువ్వులు విలపిస్తేనే తట్టుకోలేకపోయిన 'కరుణశ్రీ' పుట్టిన గడ్డ మీద పుట్టిన మా తెలుగు సోదరులే ఇంత కఠినాత్ములు ఎలా అయ్యారో అర్థం కావడం లేదు.
    'జాన్ డయ్యర్' తన ’Osmania University Uncles, బ్లాగులో ఒక ప్రత్యేకమయిన పోస్ట్ ద్వారా నా పై పద్యాన్ని ప్రచురించి(తిడుతూనే లెండి), మరింత ప్రచారం కలిగించినందుకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  48. "నేను నిన్ను'అవహేళన' చేసాను. నువ్వు ఇంకా చావలేదే ?" అని తోటి బ్లాగరును ప్రశ్నిస్తున్నాడు అభినవ డయ్యర్!?
    ఏమి సమైక్య భావన?
    తెలుగు తల్లి సంతోషిస్తున్నదా?

    రిప్లయితొలగించండి
  49. ... నిజంగా మీ పద్యాలు బాగున్నాయి. చదవగానే ఆహ్లాదం కలిగిస్తున్నాయి. చాలా కాలంగా బిజీ లైఫ్ లో పడి ఛందస్సుని ఆనందించే అలవాటు మరుగున పడింది. ఇప్పుడు మీ పద్యాలు చాలా ఆనందం కలిగించాయి. హృదయపూర్వక కృతజ్ఞతలు
    అన్నట్టు... ఈ తేటగీతిలో నాలుగో పాదంలో గణం తేడా వచ్చినట్టుంది చూడండి సార్

    రిప్లయితొలగించండి
  50. ఎందరో ఫణీంద్రగారిమీద విరుచుకుపడ్డారు గానీ ఇందులో ఆయన ఏం తప్పు రాశారో నాకు అర్థం కాలేదు. ఒక ఉద్యమం గురించి అంతమంది చనిపోయినప్పుడు దాని గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం లేదా అని మాత్రమే ఆయన ప్రశ్నించారు. పూర్తిగా కృత్రిమమైన ఉద్యమం అయితే అంతమంది స్వచ్ఛందంగా ఎందుకు చనిపోతారు? - ఆ విషయం గురించి సీరియస్ గా ఆలోచించాలి కదా? నేను ఆంధ్రావాడినే. కానీ ముందు మనిషిగా ఆలోచించాలి కదా? తెలంగాణ వాళ్లు ఉద్యమంలో ఆవేశంగా కొన్ని హద్దులు దాటుతున్నమాట నిజమని నేనూ భావిస్తాను. అది వాళ్ల తప్పయితే - కానీ ఉద్యమ కారణాల్ని కనీసం విశ్లేషించకుండా విశ్లేషించే అవకాశం కూడా ఇవ్వకుండా ఉండడం రెండో వైపు తప్పవుతుంది. అతివాదుల్ని ఏమీ చేయలేనివారే ఆ కోపాన్ని - ఆచార్య ఫణీంద్ర లాంటి సౌమ్యమైన వ్యక్తులమీద చూపిస్తారు. అది సహజం. ఒక కవి ఏ ప్రాంతం వాడయినా కావచ్చు. అతని హృదయం ఎప్పుడూ సున్నితంగా ఉంటుంది. అందరితో మాట్లాడినట్టు కరుకుగా మాట్లాడడం సరికాదు. అర్థం చేసుకోలేనివాళ్లకి ఓ నమస్కారం.

    రిప్లయితొలగించండి
  51. కిశోర్ గారు!
    మీరన్నట్టు నాలుగో పాదంలో ఏ గణ భంగం లేదు. దయ చేసి జాగ్రత్తగా చూడండి.
    మీ నిష్పాక్షిక హృదయ స్పందనకు నా మనఃపూర్వక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి